Devotional

వైకుంఠ ఏకాదశికి తితిదే భారీ ఏర్పాట్లు

TTD Grand Arrangements For Vykuntha Ekadasi

జనవరి 6, 7 తేదీల్లో జరిగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.వైకుంఠ ఏకాదశి దర్శనాని 5వ తేదీ ఉదయం నుంచి భక్తులను క్యూలైన్లలో కి అనుమతి
భక్తులు ఇబ్బంది పడకుండా మాడవీధుల్లో 1.70 కోట్ల వ్యయంతో 40 వేల మంది కూర్చునేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశాం నారాయణగిరి పార్క్ లో 26 కోట్లతో నిర్మించిన కొత్త షెడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి నారాయణగిరి పార్క్ లో మొత్తం 30 వేల మంది భక్తులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేపట్టారు వైకుంఠం క్యూకాంప్లెక్స్ 15 వేల సీటింగ్ కెపాసిటీ కలుపుకొని మొత్తం 85 వేల మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూర్చోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం అదనంగా కళ్యాణ వేదిక వద్ద కూడా భక్తులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు
ఏకాదశి రోజున భక్తులకు పంపిణీ చేయడానికి మూడు లక్షల వాటర్ బాటిల్స్ అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నాం
మూడు వేల మంది శ్రీవారి సేవకులతో వైకుంఠ ఏకాదశి వచ్చే భక్తులకు సేవలు ఏకాదశి రోజున వేకువ జామున 1.30 గంటలకు దర్శనం ప్రారంబించి విఐపి పాసులు కలిగిన వారికి రెండున్నర నుండి మూడు గంటల్లో దర్శనాలు పూర్తి చేస్తాం
ఉదయం ఐదు గంటల లోపు సామాన్య భక్తుల దర్శనం ప్రారంభిస్తాం పది రోజులు వైకుంఠ ద్వారాలు అంశంపై ఈ నెల 6 లోపు పాలకమండలి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసర పాలకమండలి సమావేశం జరగనుందిసమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్.