DailyDose

వైకుంఠ ద్వార దర్శన పెంపుకు కసరత్తు-తాజావార్తలు

Vykuntha Dwara Darsanam To Be Hiked-Telugu Breaking News Roundup Daily Today

* హైకోర్టు సూచన మేరకు రేపు(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజుల పాటు ఉంటుందని సాధ్యాసాధ్యాలను పరిశీలించమని హైకోర్టు ఆదేశాలను జారీ చేసిందని, బోర్డు అత్యవసర సమావేశంలో దీనిపై చర్చించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. స్థానిక అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు విశేష సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి ఉద్యానవనం, ఆలయ తిరుమాడ వీధులలో 80 వేల మంది భక్తులు వేచి ఉండే విధంగా ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 6వ తేదీ స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలు ముగిసిన తరువాత ప్రోటోకాల్ దర్శనాలు మొదలవుతాయని, ఉదయం 4.30 నుంచి 5 గంటల లోపే సర్వదర్శనార్దం భక్తులను అనుమతిస్తామని ఈవో స్పష్టం చేశారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మొత్తం 1కోటి 90 వేల మందికి దర్శనం భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజు దర్శనానికి వచ్చే భక్తులకు స్వామి వారి లడ్డూ ప్రసాదాల విషయంలో కూడ ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన‌ తెలిపారు. ప్రస్తుతం 9 లక్షల లడ్డులు భక్తుల కోసం అదనంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 3 లక్షల వాటర్ బాటిల్స్ భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులు, 1,300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 300 మంది విజిలెన్స్, 1500 మంది పోలీసులు ఈ పర్వదినాలలో సేవాలందించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్స్ కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు
* నేషనల్‌ క్యాపిటల్‌ పరిధిలో గత ఐదేళ్లలో కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో 60వేలకు పైగా ప్రజలు మరణించారని ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ సుభాష్‌ చోప్రా శనివారం తెలిపారు.
* ఆర్టీసీలో ప్రతి డిపో లేదా వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌ నుంచి ఇద్దరు చొప్పున 202 మందితో వెల్ఫేర్‌‌‌‌ బోర్డు ఏర్పాటైంది. సమస్యల పరిష్కారం కోసం అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా చేర్చారు.
* హైటెక్స్‌ లో 13వ ఇండియా మెడ్ ఎక్స్‌పోను ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో టెక్నాలజీకి కొరత లేదన్నారు.
* గుంటూరు జిల్లా తెనాలిలో రాజధాని పరిరక్షణ జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని తరలించవద్దంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.
* మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా అప్పట్లో జేసీ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
*తుళ్ళూరు మందడం గ్రామము సెక్షన్ 144 మరియు 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉన్నప్పటికీ సకల జనుల సమ్మెలో భాగంగా మందడం లో మహిళలు కొంత మంది బ్యాంక్ లను, స్కూళ్ళను, గవర్నమెంట్ ఆఫీసులను, షాపులను దౌర్జన్యం మరియు బలవంతముగా మూయించడానికి ప్రయత్నించుచుండగా అచ్చట విధులలో ఉన్న మహిళా పోలీసులు అడ్డుకోవడం తో మహిళలు రోడ్డు పై బైఠాయించి ట్రాఫిక్ ని దిగ్బంధం చేశారు, మహిళా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పై దుర్బాషలాడుతూ వారిని కించపరచి మాట్లాడుతూ , పోలీసు వాహానానికి అడ్డు పడి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, మహిళా పోలీసు పై దాడి చేసినారు, ఈ క్రమం లో మాహిళలకు సారద్యం వహించిన బెజవాడ నరేంద్ర, బెజవాడ సుప్రియ, బెజావాడ బ్రాహ్మణి, నూతక్కి జ్యోతి, వట్టికూటి శారద మరియు మరికొందరి పై 143,188,353 r/w 34 IPC కింద కేసులు నమోదు చేయడం జరిగినదని తెలిపారు.
*ణిగుంట ఆర్టీఓ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులులక్ష రూపాయల నగదు స్వాధీనంముగ్గురు అనధికార వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు
* ప్రతి ఒక్కరూ కనీసం ఒక నిరక్షరాస్యుని అక్షరాస్యునిగా మార్చాలని (ఈచ్ వన్ టీచ్ వన్) డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములు కావాలన్నారు. తమ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన కేకు కోశారు.
*వ్యవసాయశాఖలో ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలిస్తే గౌరవం పెరుగుతుందని ఆ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు.
*గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. 26 మంది విద్యార్థినులకు స్వల్పగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్పేట్ గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులంలో ఈ ఘటన జరిగింది
*విద్యుత్తు సంస్థలో సమ్మె అనే పదాన్ని మరచిపోవాలని ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆకాంక్షించారు. కరీంనగర్లో శుక్రవారం రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం-327 యూనియన్ నూతన సంవత్సరం 2020 డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన బి.వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళలోని కన్నూరులో జరిగిన అఖిల భారత మహా సభలో శుక్రవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
*హైదరాబాద్ సాహిత్య పండగ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్- హెచ్ఎల్ఎఫ్)ను జనవరి 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఈ సారి కార్యక్రమంలో మలయాళంపై దృష్టి కేంద్రీకరించనున్నారు. కేరళకు చెందిన ప్రసిద్ధ నృత్య, సంగీత కళలైన కూడియాట్టం, మోహిని ఆట్టం తదితర నృత్య రూపాలతో హైదరాబాద్లోని వివిధ కళావేదికలలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు https://www.hydlitfest.org/ లో సంప్రదించాలని సూచించారు.
*నీటి పంపిణీ, బోర్డు నిర్వహణ ప్రణాళికపై చర్చించేందుకు కృష్ణా యాజమాన్య బోర్డు ఈనెల 8న హైదరాబాద్లో సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టంపైన 233.62 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేల్చిన బోర్డు, రెండు రాష్ట్రాలకు నిర్ణయించిన వాటాలు, ఇప్పటివరకు జరిగిన నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన నీటి పంపిణీపై నిర్ణయం తీసుకోనుంది.
*రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి ఉపకులపతులు(వీసీ)గా ఐఏఎస్ అధికారులను నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇన్ఛార్జి వీసీలుగా ఐఏఎస్లను నియమించాలంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూ గత జులై 24న ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్.కరుణాకర్రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు*బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం తన హైదరాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లేందుకు విజయవాడ విమానాశ్రయానికి వెళ్లిన ఆయన తన పర్యటనను వాయిదా వేసుకొని.. తిరిగి ఇంటికి వెళ్లారు.
*కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి ప్రసాద్ పాండా శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ ఆయన్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. పాండా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారని రాజ్భవన్ వర్గాలు అనంతరం వెల్లడించాయి.
*ఏపీ విజిలెన్స్ కమిషనర్గా వీణాఈష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆమె విజిలెన్స్ కమిషనర్గా రెండేళ్లు కొనసాగుతారు.
*సంక్రాంతి పండగ సెలవులు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ 4,200 ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కేఎస్ బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 14 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు ఈ బస్సులు తిరగనున్నాయి
* తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌, అన్నాడీఎంకే నాయకులు పీహెచ్‌ పాండియన్‌(74) శనివారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్‌ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.