Food

లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించే ఆహారం ఇది

List of foods that boost sexual stamina

సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పుడు రకరకాల మందులు దొరుకుతున్నాయి. వయాగ్రా లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ, పురాతన కాలంలో ఇలాంటివేవీ లేవు. మరి ఆ కాలంలో ఎలా శృంగార సామర్థ్యాన్ని పెంచుకొనేవారు అంటే..శృంగారం అంటే ఆనందం.. ఆహ్లాదం.. సుఖం.. సంతోషం.. ఇవన్నీ దక్కాలంటే పడకగదిలో దుమ్ము రేపాలి. మరి, భాగస్వాములిద్దరిలో ఆ కోరికలు పీక్ లెవల్‌లో ఉండాలి. దానికి తగ్గట్లు శక్తి ఉండాలి. అంటే.. సెక్స్ సామర్థ్యం ఉండాలి. సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పుడు రకరకాల మందులు దొరుకుతున్నాయి. వయాగ్రా లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ, పురాతన కాలంలో ఇలాంటివేవీ లేవు. మరి ఆ కాలంలో ఎలా శృంగార సామర్థ్యాన్ని పెంచుకొనేవారు అంటే..
* పాలు..
కామసూత్ర ప్రకారం పాలను మించిన సెక్స్ ఫుడ్ ఇంకోటి లేదు. అందుకే శోభనం రోజు వధువు పాల గ్లాస్‌తోనే పడకగదికి వెళ్తుంది. భార్యభర్తలిద్దరు పాలు తాగి సెక్స్ జీవితాన్ని మరింత రంజుగా మార్చుకొనేందుకు ఇలా చేయిస్తారు పెద్దలు. ఆ పాలల్లో చక్కెర, తేనె కలిపి ఇస్తారు. అవి తాగితే.. ఫర్టిలిటీ రేటు, సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందట.
* కుంకుమపువ్వు.. వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే.. పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుందట. సెక్స్ స్టామినా కూడా ఎక్కువవుతుందట.
* శతావరి..
ఈ మొక్కల్లో వీర్యాన్ని వృద్ధి చేసే లక్షణాలు బాగా ఉంటాయట. రాత్రి పూట పడకగదిలోకి వెళ్లేముందు గుళికలుగా చేసుకొని మింగితే దుమ్మురేపేయొచ్చు.
* వెల్లుల్లి..
సంతానోత్పత్తిని పెంచడంలో వెల్లుల్లి పాత్ర అమోఘం. ఈస్ట్రోజెన్ స్థాయులను బ్యాలెన్స్ చేయడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. అందుకే పుర్వీకులు వీటిని ఎక్కువగా తినేవారట.
* అశ్వగంధ..
గుర్రం మూత్రం వాసనను కలిగి ఉంటుంది. గుర్రంలా స్ట్రాంగ్‌గా, స్టామినా ఇచ్చేందుకు అశ్వగంధ ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే సెక్స్ చేసేముందు దీన్ని తింటే పండగే.
* మెంతులు..
చాలామంది మగవారు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు మెంతికూర, మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే సమస్య తీరుతుంది. కామసూత్ర ఈ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
* జాజికాయ..
ఇది వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకొని, ప్రతిరోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో కలిని సేవిస్తే, సంతానలేమితో ఉన్న వారికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
* కిరా జారి..
నేపాల్, టిబెట్, చైనాల్లో వీటిని ఎక్కువగా అమ్ముతారు. రేటు కూడా ఎక్కువే. కామసూత్రలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇవి తింటే సెక్స్ స్టామినా పది రెట్లు పెరుగుతుందట.