Movies

షబానా ఆజ్మీ కారుకు ప్రమాదం

Shabana Azmi Car Accident In Mumbai

సీనియర్​ బాలీవుడ్​ నటి షబానా అజ్మీ కారు ప్రమాదానికి గురైంది.

ముంబయి- పుణే ఎక్స్​ప్రెస్​వేపై ఖలాపుర్​ సమీపంలో ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. షబానాకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఆమెను నవీ ముంబయిలోని ఎమ్​జీఎమ్ ఆసుపత్రికి తరలించారు. ​

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమె భర్త జావేద్​ అక్తర్​ కూడా ఉన్నారు.

అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

కారును లారీ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.