Devotional

షిర్డీలో నిరసనలు

Shirdi Pathri Trouble By Maharashtra Govt

షిర్డీలోని సాయిబాబా ఆల‌యాన్ని మూసివేయ‌డం లేద‌ని సంస్థాన్ బోర్డు స‌భ్యులు ఒక‌రు స్ప‌ష్టం చేశారు.

సాయిబాబా జ‌న్మ‌స్థ‌లం అభివృద్ధి కోసం మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే వంద కోట్లు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ..

షిర్డీ ప్ర‌జ‌లు కేవ‌లం నిర‌స‌న చేప‌డుతున్న‌ట్లు సంస్థాన్ స‌భ్యులు వెల్ల‌డించారు.

షిర్డీలో కేవ‌లం ప‌ట్ట‌ణ బంద్‌ను పాటించ‌నున్నామ‌ని, కానీ ఆల‌యాన్ని మూసివేయ‌డం లేద‌ని సంస్థాన్ బోర్డు స‌భ్యులు తెలిపారు.

ఆల‌యాన్ని తెరిచి ఉంచుతామ‌ని, రూమ్ సౌక‌ర్యం, ప్ర‌సాద విత‌ర‌ణ య‌దావిధిగా జ‌రుగుతుంద‌ని సంస్థాన్ బోర్డు వెల్ల‌డించింది.

సీఎం చ‌ర్యకు నిర‌స‌న‌గా.. షిర్డిలోని సాయిబాబా మందిరాన్ని ఆదివారం నుంచి నిర‌వధికంగా మూసివేయ‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను సంస్థాన్ బోర్డు కొట్టిపారేసింది.

సాయిబాబా జ‌న్మ‌స్థ‌లంగా భావిస్తున్న‌ ప‌త్రికి వంద కోట్లు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ షిర్డిలోని సాయిబాబా ఆల‌య ట్ర‌స్ట్ ..

ఆల‌యం మూసివేత‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ్యాపించాయి.

జ‌న‌వ‌రి 19 నుంచి ఆల‌యాన్ని మూసివేస్తున్నామ‌ని, శ‌నివారం సాయంత్రం గ్రామ‌స్తుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేయనున్నామ‌ని,

ఆ త‌ర్వాత‌ మూసివేత‌కు సంబంధించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని,

ఒక‌వేళ భ‌క్తులు షిర్డీకి వ‌చ్చినా.. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని సాయిబాబా సంస్థాన్ ట్ర‌స్ట్ అధికారి వాక్‌చోరే తెలిపారు.