DailyDose

రణరంగంలా చౌటుప్పల్. కొట్టుకున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే-రాజకీయ

MLAs Fight In Choutuppal-Telugu Political News Roundup

*చౌటుప్పల్ మున్సిపాల్టీ కేంద్రం రణ రంగాన్ని తలపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపాల్టీ కేంద్రం వద్ద కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ముఖ్యంగా యదాద్రి జిల్లాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ లు డీ అంటే డీ అనే స్థాయిలో కౌన్సిల్ స్థానాలను గెలుచుకున్నాయి. ఈ నేపద్యంలోనే నేడు చైర్మన్ ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసాయి. అనంతరం సీపీఎం కౌన్సిలర్లు టీఆర్ఎస్ వల వేసింది., పలోభాలకు గురి చేసింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్తున్న సీపీఎం కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో రాజగోపాల రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసాయి. ఇద్దరూ ఒకటి పై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అనంతరం కౌన్సిల్ లోకి వెళ్లి ఇది అక్రమమైన పొత్తు అంటూ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమమో పోలీసులు ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల పై రాళ్ళూ రువ్వినట్టు తెలుస్తోంది.
*ఏపీ భాజపా అద్యక్షుడిగా మాధవ్
భాజపా జాతీయ అద్యక్షుడు మారాడు. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అద్యక్ష బాద్యతలు స్వీకరించారు. ఇక రాష్ట్రాల్లో కూడా అద్యక్ష మార్పు ఉంటుందని ప్రచారం మొదలైంది. ఏపీ భాజపాకి కొత్త అద్యక్షుడు వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అద్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఎన్నికల ముందు పార్టీలో చేరారు. అప్పటి రాజకీయ పరిస్థితులు నేపద్యంలో ఆయన్ని అద్యక్ష పదవి వరించింది.
*హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ తరఫున ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్‌లో జగన్‌ పేర్కొన్నారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయనే కారణంతో హాజరు మినహాయింపునకు నిరాకరించడం సరికాదన్నారు. గతంలో ఈడీ, సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరిపే అవకాశముంది.
*
* శుక్ర’వారాన్ని కూడా రద్దు చేస్తారేమో… లోకేష్
ప్రతి వారం సీబీఐ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్న కోపంతో వైఎస్ జగన్ శుక్రవారాన్ని రద్దు చేసి వారానికి ఆరు రోజులు చేస్తారేమోనని నారా లోకేష్ సెటైర్లు వేశారు. శాసనమండలిని రద్దు చేయడానికి ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంలో సీఎం జగన్‌పై నారా లోకేష్ ట్వీట్ చేశారు.‘తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ గారికి కోర్టు మిన‌హాయింపు ద‌క్క‌లేదు. కోర్టుల‌ను ర‌ద్దు చేస్తారా ? లేదంటే… ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని శుక్ర‌వారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా ?’ అని ట్వీట్ చేశారు.అసలు తాము శాసనమండలిలో ఏ బిల్లును కూడా అడ్డుకోలేదని, కేవలం సవరణలు మాత్రమే కోరామని లోకేష్ చెప్పారు. ‘తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు వస్తే శాసన
*కరీంనగర్‌లో తెరాస ఆధిక్యం
కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ అధికార తెరాస 15 డివిజన్లలో జయకేతనం ఎగరవేసింది. భాజపా 8 చోట్ల.. ఇతరులు ఒక చోట గెలుపొందారు. మొత్తం 60 స్థానాల్లో ఇప్పటికే రెండు ఎకగ్రీవమైన విషయం తెలిసిందే. తెరాస పార్టీ నుంచి 51వ డివిజన్‌లో రవీందర్ సింగ్, 49వ డివిజన్‌లో కమల్ జిత్ కౌర్, 60వ డివిజన్‌లో రమణ రావు, 33వ డివిజన్‌లో సునీల్ రావు, 41వ డివిజన్‌లో బండారి వేణు, 21వ డివిజన్‌లో సాగర్, 14వ డివిజన్‌లో మహేశ్, 59వ డివిజన్‌లో గందె మాధవి, 42వ డివిజన్‌లో మేశినేని వనజ, 23వ డివిజన్‌లో హర్ష కిరణ్మయిలు గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 22న జరిగితే.. కరీంనగర్‌లో రెండు రోజుల ఆలస్యంగా పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే
* నిజామాబాద్‌లో అన్నీ తెరాస ఖాతాలోకే!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా 11వార్డు కార్పొరేటర్ నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్‌గా 14వ వార్డు కార్పొరేటర్ ఎండీ ఇద్రీస్ ఖాన్ ఎన్నికయ్యారు. తెరాస తరపున మేయర్‌గా పోటీ చేసిన నీతూ కిరణ్‌కు 38 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి లావణ్యకు 29 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్‌గా తెరాస అభ్యర్థిగా నిలిచిన ఇద్రీస్ ఖాన్‌కు 38 ఓట్లు రాగా.. భాజపా తరపున పోటీలో నిలిచిన మల్లేశ్‌ యాదవ్‌కు 29 మంది చేతులెత్తి బలపర్చారు. దీంతో మేయర్‌గా నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్‌గా ఇద్రిస్ ఖాన్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
*కుహనా మేధావులు పెరిగి పోయారు..: కిషన్‌రెడ్డి
సీఏఏపై నిర్మాణాత్మక చర్చ జరగాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుహనా మేధావులు పెరిగి పోయారన్నారు. సీఎంలతో సమావేశం పెడతామని అంటున్నారని, మనది సెక్యులర్‌ దేశమని, మైనార్టీలకు ఎక్కువ హక్కులు ఉన్నాయని అన్నారు. ఇస్లాం దేశాల్లో మైనార్టీలకు హక్కులు ఉండవన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. దేశంలో పెట్టబడులు రాకుండా చేసే కుట్రలో భాగంగానే.. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
*జగన్‌ను ఎద్దేవాచేసిన నిమ్మల రామానాయుడు
సీఎం జగన్‌ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నాడని, కూచిపూడి నాట్యకారిణిలా జగన్‌ ఎన్నో సార్లు మడమ తిప్పుతున్నాడని ఆయన ఎద్దవాచేశారు. రాజీనామాలు చేసే తమ పార్టీలోకి రావాలని జగన్‌ ప్రగల్భాలు పలికారని, టీడీపీ నేతలకు కండువాలు కప్పినప్పుడు విశ్వసనీయత గుర్తురాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి వైసీపీలోనే ఉన్నారని చెప్పడం ఏ విలువలు, ఏ విశ్వసనీయత అని నిమ్మల నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో జగన్‌ ఉన్నాడని, తొలిసారి ప్రజాస్వామ్యంలో నియంతను చూస్తున్నామన్నారు. ఫ్యాక్షన్‌ స్వభావంతో జగన్‌ మండలిని రద్దు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ మండలికి పట్టిన గతే రేపు అసెంబ్లీకి పడుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీని కూడా రద్దు చేయడానికి జగన్‌ పూనుకుంటాడని నిమ్మల రామానాయుడు అన్నారు.
*అమిత్‌ షాకు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఘాటుగా స్పందించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్‌ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్‌ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు.
*పైశాచిక ఆనందం కోసమే అడ్డుకున్నారు: పేర్ని
శాసనససభ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి రద్దుపై సభలో చర్చ జరుగుతోంది. పేదల కోసం ముఖ్యమంత్రి జగన్‌ యజ్ఞం చేస్తుంటే కొందరు విషం చిమ్ముతున్నారని ప్రతిపక్ష తెదేపాపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. మండలి వద్దంటూ 2004లో అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఆయన వినిపించారు. మండలిపై చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో ఆయన మాటల్లోనే అర్థమైందన్నారు. చంద్రబాబు ప్రతి నిర్ణయంలోనూ యూటర్న్‌ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం, పైశాచిక ఆనందం కోసం మండలిలో తెదేపా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.రాయలసీమలో తెదేపాకు కేవలం మూడే సీట్లు వచ్చాయని పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం బందరు పోర్టు గురించి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ వైకాపా ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో బందరుపోర్టు పనులను ప్రారంభిస్తుందని సభకు తెలిపారు.
*101 దేశాల్లో పెద్దల సభలు లేవు: ధర్మాన
ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని, 101 దేశాల్లో పెద్దల సభలు లేవని అన్నారు. బ్రిటీషర్ల ప్రోత్సాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పెద్దలను గౌరవిస్తున్నామన్న పేరుతో దేశానికి కన్నంపెట్టే పనిచేశారని విమర్శించారు. బ్రిటీష్‌ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారని ధర్మాన చెప్పారు. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయని, ఇలాంటి అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. శాసనమండలి లేని రాష్ట్రాల్లో కొంపలు మునగడం లేదని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
*ఇది.. జగన్ సృష్టించిన చరిత్ర: బుద్దా వెంకన్న
మండలి రద్దు చేయాలన్న ఏపీ కేబినెట్ నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఎమ్మెల్సీ పదవి పోతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతి కోసం తాము చేసిన పోరాటం.. చరిత్రలో తమను స్వాతంత్ర్య సమరయోధుల సరసన నిలుపుతుందన్నారు. పదవులు తమకు వెంట్రుకతో సమానమన్నారు. పదవుల కోసం తమ పార్టీ నేతలు పని చెయ్యడం లేదని.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లమని స్పష్టం చేశారు. ప్రజల కోసం పదవిని పోగొట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స్ఫూర్తితో తాము మరింత పోరాడతామని ఆయన తెలిపారు. దేశ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను విమర్శిస్తున్నారన్నారు. ఇది జగన్ సృష్టించిన చరిత్ర అన్నారు. తమ పోరాటం మూడు రోజుల క్రితం ప్రారంభమైందని.. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం రాజధాని రైతుల కోసం గత ముప్ఫై రోజుల నుంచి పోరాడుతుందన్నారు.
*జగన్ ఇంత పిరికివాడని అనుకోలేదు: కేశినేని ట్వీట్‌
శాసనమండలి రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది.. 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవటానికి కాదని అన్నారు. సీఎం జగన్ ధైర్యంగా నిలబడి దమ్ముగా పోరాడతారని అనుకున్నారని.. ఇంత పిరికివాడని అనుకోలేదని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.
*వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా మాధవి
వేములవాడ పాలక సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తైంది.అధ్యక్ష స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి రామతీర్థపు మాధవి, బీజేపీ నుంచి ముప్పిడి సునందలు పోటీ పడ్డారు. చేతులెత్తి మద్దతు తెలిపే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు.ఇందులో మాధవికి 22 ఓట్లు, సునందకు 5 ఓట్లు రావడంతో.. మాధవిని అధ్యక్షురాలుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ నుంచి మధు రాజేందర్ శర్మ, బీజేపీ నుంచి రేగుల సంతోష్ బాబు పోటీ పడ్డారు. ఇందులో రాజేంద్ర శర్మకు 23 ఓట్లు రాగా, సంతోష్‌కు 5 ఓట్లు వచ్చాయి. రాజేంద శర్మను ఉపాధ్యక్షులుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
*అది జగన్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనం: శైలజానాథ్‌
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయడం.. సీఎం జగన్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై స్పందించిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంఖ్యాబలం ఉందికదా అని ఏదైనా చేస్తానంటే సరిపోదన్నారు. మూడు రాజధానుల నిర్ణయం రాజకీయ కక్షపూరిత చర్యేనని విమర్శించారు. మండలిని రద్దు చేయాలనుకోవడం.. జగన్‌ తన ఓటమిని ఒప్పుకున్నట్లేనని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు.
*అలాంటి హీన చరిత్ర సీఎం జగన్‌కే సొంతం: లోకేశ్
సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైర్ అయ్యారు. అమరాతికి విదేశాల్లోనూ మద్దతు లభిస్తుందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని ప్రవాసాంధ్రులు కోరుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించమని విదేశీ వీధుల్లోనూ వాళ్లు తమ ఆకాంక్షను చాటారని కొన్ని ఫొటోలను పోస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిపై కక్ష, ద్వేషంతోనే వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను కాకుండా తమ స్వార్థానికీ, ద్వేషానికీ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన నేతలు చరిత్రలో నియంతలుగానే మిగిలిపోయారని విమర్శించారు. తెలుగునేలపై అలాంటి హీన చరిత్రను సొంతం చేసుకుంటున్న మొదటి వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
*భయపెట్టి లాక్కోవటం మంచి పద్ధతా?: అచ్చెన్న
ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఆదుర్దాగా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభ సమావేశాలు అంటే ఒక విధానంపై అజెండా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం దానిని పక్కనపెట్టారని విమర్శించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపామన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు ఫోన్‌ చేసి బీఏసీ సమావేశం ఉందని చెప్పారన్నారు.‘‘ఇప్పటి వరకు 32 బిల్లులను మండలికి పంపించారు. వాటిని మేం వ్యతిరేకించలేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాం’’ అని అచ్చెన్న అన్నారు. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని వితండవాదం చేస్తున్నారని, అలాంటప్పుడు దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా?’’ అని అచ్చెన్న విమర్శించారు. కేసులు పెడతామని భయపెట్టి ఎమ్మెల్సీలను పార్టీలోకి లాక్కోవడం మంచి పద్ధతా? అని ప్రశ్నించారు.
*గవర్నర్, శాసన సభ స్పీకర్ కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం టీడీపీ శాసన సభా పక్షం లేఖలోని సారాంశం…సభల నిర్వహణలో బీఏసీ అజెండా ను ఉల్లగించారని ఫిర్యాదు.ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారు3 రోజులు మాత్రమే అసెంబ్లీ అని బీఏసీ లో నిర్ణయించారు.బీఏసీ కి చెప్పకుండానే మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించారు.మండలి సెలక్ట్ కమిటీ కి పంపిన బిల్లులను అసెంబ్లీ లో చర్చించడం రూల్స్ విరుద్ధం.కౌన్సిల్ లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదురాజ్యాంగ విరుద్ధం గా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బాయ్కాట్ చేసాం
*3 రాజధానులు..ప్రజల ఆకాంక్ష: ఆళ్ల నాని
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని సీఎం జగన్‌ చెప్పారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనేనని ఆళ్ల విమర్శించారు. తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు ఏపీ ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆళ్లనాని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్యాలరీలో కూర్చొని మండలిని చంద్రబాబు డిక్టేట్‌ చేశారని విమర్శించారు.
*సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వండి: షరీఫ్ లేఖ
సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ ఇటీవల శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బిల్లుపై రెండు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యత్వం ఉన్న పార్టీలకు షరీఫ్ లేఖ రాశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు పేర్లు ఇవ్వాలని ఆయన కోరారు. సంబంధిత శాఖా మంత్రులే ఛైర్మన్లుగా 9 మందితో ఒక్కో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో తెదేపా నుంచి 5, వైకాపా, భాజపా, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించనున్నారు.
*మోదీది బలమైన నాయకత్వం: పవన్
పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని.. సేవ చేయాలనే వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. తాను మొదటి భారతీయుణ్ణి.. చివర కూడా భారతీయుణ్ణే అని వ్యాఖ్యానించారు. నెక్లెస్ రోడ్డులో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాహారతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, గవర్నర్ తమిళిసై, అష్టావధాని గరికపాటి నరసింహారావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఎంతోమంది త్యాగఫలితమే మనం జరుపుకొనే ఈ సంబరాలని చెప్పారు. ‘‘బలమైన నాయకత్వం ప్రధాని మోదీది. శత్రుదేశాలను గజగజ వణికే శక్తి ఆయనది. ప్రభావితం చేసే, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి. అది భాజపాలో ఉంది. దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని ఉంది. దేశానికి సేవ చేయాలనే భాజపాతో కలిశా. పాక్లోని హిందువులకు రక్షణ లేదు. హిందువులను ఊచకోత కోసే సెక్యులరిజం మనకు అవసరం లేదు. దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. భారత్ మాతాకీ జై’’ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.
*జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు:లోకేశ్
శాసన మండలి రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మండలి రద్దు, పునరుద్ధరణ తీర్మానాలు పెండింగ్లో ఉన్నాయి. మండలి తీర్మానాలు పార్లమెంటు ముందుకు వరుసగా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపిందని వెంటనే రద్దు చేయరు. ఎందుకు రద్దు చేస్తుందో ప్రభుత్వం తగిన కారణాలు కేంద్రానికి చెప్పాలి. రాష్ట్రపతి గెజిట్ వచ్చేవరకు శాసన మండలి మనుగడలో ఉంటుంది. సమావేశాలు జరుగుతాయి. బిల్లును తిరస్కరించడం వేరు.. సవరణలు ఇవ్వడం వేరు. ఆంగ్ల మాధ్యమం బిల్లును మండలిలో తెదేపా తిరస్కరించలేదు. తెలుగులోనూ బోధనకు ఆప్షన్ ఇవ్వాలని సవరణ కోరాం. బిల్లులపై సవరణలు ఇచ్చినంత మాత్రాన మండలిని రద్దు చేస్తారా? దావోస్ సదస్సుకు రావాలని రాష్ట్రానికి ఆహ్వానం కూడా లేదు. ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణ తన్నుకుపోతోందని’’ లోకేశ్ పేర్కొన్నారు.
*చట్టాలను తిరస్కరిస్తారా?: కన్నా
రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రులు కొందరు పార్లమెంటు చేసిన చట్టాలనూ తిరస్కరిస్తామని చెబుతున్నారని.. అలా చేయడమంటే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవటమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులే చట్టాలను గౌరవించకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటులో కూలంకషంగా చర్చించిన అనంతరం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాద్ధాంతం చేసి ప్రజల్లో అశాంతిని రేకెత్తించి, కుల, మతాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
*మండలి రద్దు యోచన మరో తుగ్లక్ నిర్ణయం-లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, శాసన మండలిని రద్దు చేయాలనుకోవడం మరో తుగ్లక్ చర్య అవుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ మంత్రులను బలి చేసే పనిని ఇప్పటికే మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు రావాలంటూ ఈ సారి ఆహ్వానం కూడా అందలేదని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ తెలంగాణ తన్నుకుపోతోందని విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. మండలి రదు,్ద పునరుద్ధరణకు సంబంధించి కేంద్రంవద్ద పలు రాష్ట్రాలకు చెందిన తీర్మానాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని వివరించారు. పార్లమెంటులో బిల్లులు క్రమం ప్రకారం వస్తాయని, మండలి రద్దుపై ప్రభుత్వం తీర్మానం పంపించిన వెంటనే రద్దు చేయరని తెలిపారు. రాష్ట్రపతి గెజిట్ విడుదలయ్యే వరకూ మండలి ఉంటుందని, సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు.
*వైకాపా రంగులకు రూ.1,400 కోట్లు వృథా కాదా?ఎమ్మెల్యే రామానాయుడు
శాసనమండలి నిర్వహణకు ఏటా రూ.60కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్న సీఎం జగన్.. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసేందుకు రూ.1,400 కోట్లు ఎలా వృథా చేశారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. సీఎం ఇంటి సౌకర్యాలకు, విదేశీ పర్యటనలకు రూ.కోట్లు ఖర్చు చేయడం వృథా కాదా? అని దుయ్యబట్టారు. ఆదివారం మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయడం అసాధ్యమన్నారు. మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు. సభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగకుండానే శాసనసభనుఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ అసెంబ్లీని తన సొంత జాగీరులా మార్చారని విమర్శించారు.
*జనసేన న్యాయ విభాగానికి అడహక్ కమిటీ
జనసేన న్యాయ విభాగానికి ఐదుగురు సభ్యులతో అడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ సభ్యులుగా శింగలూరి శాంతి ప్రసాద్ (కృష్ణా రీజియన్), ఏవీఎన్ఎస్ రామచంద్రరావు (తూర్పు కోస్తా), కొప్పెర కోటేశ్వరరావు (దక్షిణ కోస్తా), ఎ.ప్రశాంతి (ఉత్తరాంధ్ర), అరని కవిత (రాయలసీమ) ఉంటారని వివరించారు.
*ఆ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించండి-బుద్ధా వెంకన్న
శాసన మండలిని రద్దు చేసే ముందు మంత్రులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలతో సీఎం రాజీనామా చేయించి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండు చేశారు. మండలిని రద్దు చేసే ముందు వైకాపా ఎమ్మెల్సీలందరితో రాజీనామా చేయిస్తే తానూ అందుకు సిద్ధమేనని సవాల్ విసిరారు. లేని పక్షంలో రెఫరెండం నిర్వహించాలన్నారు. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బుద్ధా వెంకన్న విలేకరులతో మాట్లాడారు. ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేని సీఎం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తమకూ సమయం వస్తుందని వ్యాఖ్యానించారు.
*తెలంగాణలోనూ భాజపా, జనసేన దోస్తీ!
ఆంధ్రప్రదేశ్లో భాజపాతో పొత్తు కుదుర్చుకున్న జనసేన.. తెలంగాణలోనూ ఆ పార్టీతో కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోందా..? హైదరాబాద్లో ఆదివారం నెక్లెస్రోడ్డులో జరిగిన భారతమాత మహాహారతిలో భాజపా, జనసేన ముఖ్య నేతల మధ్య జరిగిన మాటామంతీ పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. సీఏఏకు మద్దతుగా భారీ సభలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. వాటికి హాజరు కావాలని పవన్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. పవన్ అంగీకరించారు. తెలంగాణలో రెండు పార్టీలూ కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లే విషయంపై అయిదారు రోజుల్లో ప్రత్యేకంగా సమావేశం అవుదామని అనుకున్నారు. భారతమాత మహాహారతి కార్యక్రమం ప్రారంభం ముందు పవన్కల్యాణ్, లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తదితరులు కాసేపు మాట్లాడుకున్నారు. వారంలో రెండు, మూడు రోజులు హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నానని, తెలంగాణ విషయంపై కూర్చుని మాట్లాడుకుందామని, ఎలా పనిచేయాలనే విషయంపై చర్చిద్దామని భాజపా నేతలతో పవన్ అన్నట్లు తెలిసింది.
*సీఏఏతో ఎవరికి నష్టమో చెప్పాలి: కిషన్రెడ్డి
మజ్లిస్తో కలిసి సాగుతున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు భాజపాను విమర్శించే నైతిక హక్కు లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) దేశంలోని 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికైనా నష్టం కలిగించేలా ఉంటే చూపాలని సవాల్ విసిరారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో, అంతకుముందు గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఏఏను అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మజ్లిస్ పచ్చి మతోన్మాద పార్టీ అని విమర్శించారు. అలాంటి పార్టీ చేతిలో తెరాస ప్రభుత్వం కీలుబొమ్మలా మారి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు.
* ర్ణాటక రైతుల అరెస్ట్ ను ఖంఢించిన చంద్రబాబు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు కర్ణాటక రైతులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబుకర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం హేయం.రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారు. తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటి..?తక్షణమే కర్ణాటక రైతులను వదిలేయాలి. లేకుంటే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను.ఏవిధంగా విడుదల చేయరో చూస్తాను