Movies

మల్లికా మీట్స్ మిస్టర్ మైక్రోసాఫ్ట్

Mallika Sherawat Meets Bill Gates In Seattle

నటి మల్లికా శెరావత్‌ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. మర్డర్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా..మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్‌ని క‌లిసి మ‌హిళా సాధికార‌త గురించి చ‌ర్చించింద‌ట. వాషింగ్ట‌న్‌లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు క‌ల‌వడం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. ఈ విష‌యం గురించి మ‌ల్లికా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేసింది. ఆయ‌న‌తో మహిళా సాధికార‌త గురించి మాట్లాడ‌డం సంతోషంగా అనిపించింద‌ని మ‌ల్లికా త‌న పోస్ట్‌లో పేర్కొంది. సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్-13లోను మ‌ల్లికా శెరావ‌త్ సంద‌డి చేసిన సంగతి తెలిసిందే.