NRI-NRT

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బందరులో అన్నమయ్య సంకీర్తనోత్సవం

Annamayya Sankeertanotsavam By SiliconAndhra In Machilipatnam

అన్నమయ్య కీర్తనలు తెలుగునాట అజరామరంగా నిలిచిపోయాయని సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ అన్నారు. సిలికానాంధ్ర ఆద్వర్యంలో తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనా మహోత్సవాలు ఆదివారం చిట్టిపిలారయ్యా దేవస్థానంలో శ్రుతి సౌరభం కళావేదిక పై వైభవంగా జరిగాయి. అన్నమాచర్య సంగీత సభ గౌరవాద్యక్షుడు సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అన్నమయ్య కీర్తనలలో భావాలు భక్తీ, ఆద్యాత్మికతకు నెలవై ఉన్నాయన్నారు. తెలుగు భాషకు అన్నమయ్య కీర్తనలు పుస్తిని చేకూర్చయన్నారు. సంగీత సభ అద్యక్షుడు డా.బీ.ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనను నగరంలో పలువురు సంగీత కళాకారులు విద్యార్ధులు నేర్పడం ముదావహమన్నారు. అన్నమాచర్య సంగీత సభ కార్యదర్శి జే.ఎం.ఎస్.కృష్ణారావు అర్గానైగింగ్ సెక్రటరీ సింగరాజు గోవర్ధన్ , కే.అచ్యుతరామయ్య, అమనుకొండ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అన్నమాచర్య సంకీర్తన ఉత్సవంలో పలువురు గాయనీ గాయకులూ అన్నమయ్య కీర్తనలు మృదుమధురంగా గానం చేసారు. విజయవాణి సంగీత కళాశాల వ్యవస్థాపకుడు మొదలి చంద్రశేకర్, ప్రముఖ సంగీత విద్వాంసులు సింగరాజు కళ్యాణి , అల్లాడ బాలత్రిపుర సుందరి, ప్రముఖ సంగేట దర్శకుడు వడ్లమన్నటి మహేష్ కుమార్, మొక్కపాటి మీనాక్షి చివుకుల వెంకట నరసింహం, కాశీపట్నం ఉమా, చిత్రపు కిరణ్మయి, రాధికా సుబ్రహ్మణ్యం, అన్నమయ్య కీర్తనలు గానం చేసారు. అన్నమయ్య పంచ రత్న కీర్తనలను ఆలపించారు. గోడవల్లి శ్యామల అన్నమాచర్య హరికధ గానం చేసారు. వయోలిన్ పై చావాలి శ్రీనివాస్, మృదంగంపై కొమ్ము నాగేశ్వరరావు కీబోర్డుపై తేజ, తబలా పై దేవకిశోర్ సహకరించారు.