DailyDose

భారీ గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న UAE-వాణిజ్యం

UAE Finds New Oil & Gas Reserves-Telugu Business News Roundup

*బడ్జెట్‌ నిరాశ నుంచి తేరుకున్న మార్కెట్లు నేడు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు అందడం, చమురు ధరలు పడిపోవడం వంటి సానుకూలతలు సూచీల పరుగుకు దన్నుగా నిలిచాయి. కరోనా భయంతో చైనాలో విధించిన ఆంక్షల నేపథ్యంలో చమురు డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 13 నెలల కనిష్ఠానికి దిగి వచ్చాయి. దీంతో రూపాయి సైతం బలపడింది. ఈ పరిణామాలతో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మదుపర్ల సంపద మంగళవారం తొలి 90 నిమిషాల్లో రూ.2లక్షల కోట్లు పెరిగింది. ఉదయం 11.55 గంటల సమయంలో సెన్సెక్స్‌ 793 పాయింట్లు లాభపడి 40,665 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 237 పాయింట్లు ఎగబాకి 11,945 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.50 వద్ద కొనసాగుతోంది.
* సీఈఓని పక్కకు తప్పించిన ఎయిర్‌ఏషియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియాలో ఇద్దరు ఉన్నతాధికారుల్ని కంపెనీ రెండు నెలల పాటు పదవీచ్యుతుల్ని చేసింది. ఎయిర్‌బస్‌తో జరిగిన ఒప్పందాన్ని ఖరారు చేసుకునే సమయంలో వీరు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సంస్థ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కమరుద్దీన్‌ మెరానన్‌ను ప్రస్తుతానికి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మలేషియా స్టాక్‌ మార్కెట్‌ ఫైలింగ్‌లో సంస్థ పేర్కొంది. వీరిని ప్రస్తుతానికి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ బోర్డు మెంబర్లుగా నియమిస్తున్నట్లు తెలిపింది.
* అద్భుతమైన డిస్‌ప్లేతో పోకో ఎక్స్ 2 వచ్చేసింది..
షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్‌తో ఆకట్టుకున్న పోకో ఎక్స్‌ 1 తరువాత, ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎక్స్‌ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2 బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్‌టెల్ లేదా జియో నెట్‌వర్క్‌ లో ద్వారా వై ఫై కాలింగ్‌ సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ , ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
*ఎన్‌ఆర్‌సీపై కేంద్రం కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ పేర్కొన్నారు.
*యూఏఈలో అత్యంత భారీ గ్యాస్ నిల్వలు
చమురు ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్)లో అగ్రసభ్యదేశమైన యూఈఏ అత్యంత భారీ గ్యాస్ నిల్వలు కనుగొన్నట్లు ప్రకటించింది. దుబాయ్, అబుదాబిల మధ్య 80 లక్షల కోట్ల ఘనపు అడుగుల (2.2 లక్షల కోట్ల ఘనపు మీటర్లు) షాలో గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు అబుదాబి నేషనల్ ఆయిల్ కో ప్రకటించింది. ఈ గ్యాస్ వనరుల తవ్వకం, అభివృద్ధి నిమిత్తం అబుదాబి నేషనల్ ఆయిల్, దుబాయ్ సప్లై అధారిటీల మధ్య జరిగిన ఒప్పందానికి అబుదాబి, దుబాయ్ నేతలు హాజరయ్యారు. యూఏఈ చమురు నిల్వలను 105 బిలియన్ బారెళ్లకు పెంచడానికి ఏడు బిలియన్ బారెళ్ల చమురు క్షేత్రాలను నవంబరులో అబుదాబి ప్రకటించింది. 58 లక్షల కోట్ల ఘనపుటడుగుల సంప్రదాయ గ్యాస్ను సైతం కనుగొనడంతో మొత్తం నిల్వలు 273 లక్షల కోట్ల ఘనపుటడుగులకు చేరింది.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 306 పాయింట్లు లాభపడి 40,178 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 11,786 వద్ద కొనసాగుతోంది.
*భారత నెటిజన్లు బడ్జెట్2020 సమయంలో సోషల్ మీడియా వేదికగా లాభనష్టాలను చర్చించారు. ముఖ్యమైన సమాచారం షేర్ చేయడం, వార్తలను షేర్ చేయడం వంటివి ఉన్నాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 11 లక్షల ట్వీట్లను షేర్ చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ ప్రజానాడి తెలుసుకోవడానికి పోల్స్ నిర్వహించడం, లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేయడం వంటివి చేసింది. వీటికి ప్రజా స్పందనలు ఎక్కువగా ఉన్నాయి.
*ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు దారి తెలుసుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అందులో మనం వెళ్లాలనుకున్న ప్రదేశానికి సంబంధించిన వివరాలను టైప్ చేసి అది చూపించిన దారిలో వెళుతుంటాం. గూగుల్ కూడా ఏ మాత్రం లోపం లేకుండా కచ్చితమైన లోకేషన్లు చూపిస్తూ మనం వెళ్లాలనుకున్న ప్రదేశానికి చేరుస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి స్మార్ట్ఫోన్స్తో గూగుల్ మ్యాప్స్నే బోల్తా కొట్టించాడు. 99 స్మార్ట్ ఫోన్లతో కృత్రిమంగా నకిలీ ట్రాఫిక్ జామ్ని సృష్టించాడు.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్, దుబాయ్లో తన సంయుక్త సంస్థతో కలిసి వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎంఆర్ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ) అనే పేరుతో ఈ యూనిట్ను దుబాయ్కు చెందిన ఇమ్దాద్ అనే సంస్థ భాగస్వామ్యంతో నెలకొల్పినట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ వెల్లడించింది. దాదాపు 45 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు, రోజుకు 1200 టన్నుల మున్సిపల్, పారిశ్రామిక వ్యర్థాలను ఇక్కడ ప్రాసెస్ చేయవచ్చని రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ గౌతమ్రెడ్డి తెలిపారు.
*బ్లాక్చైన్ రంగంలో పనిచేస్తున్న అంకురాలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, టెక్ మహీంద్రా భాగస్వామ్యంతో కలిసి టి-బ్లాక్ యాక్సిలరేటర్ను ప్రారంభించింది. ఈ రంగంలోని అంకురాలకు పోటీ నిర్వహించి, వాటికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈ యాక్సిలేటర్ ప్రోగ్రాం దోహదం చేస్తుంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా బ్లాక్ చైన్ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుద్దు మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలో మొత్తం 250 సంస్థలను ఎంపిక చేస్తామని, అందులో నుంచి రెండో దశలో 25, తుది దశలో 5 అంకురాలు విజేతలుగా నిలుస్తాయన్నారు.
*కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకం కింద ఉత్తర కర్నాటకలోని బీదర్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూపు చేపట్టి నిర్వహించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జీఎంఆర్ గ్రూపు సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. బీదర్ నుంచి బెంగుళూరుకు తొలి విమాన సర్వీసును ఈ వారంలో మొదలు పెట్టనున్నట్లు, తద్వారా బీదర్ విమానాశ్రయ కార్యకలాపాలను లాంఛనంగా ప్రాంభించినట్లు అవుతుందని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సౌత్) ఎస్జీకే కిషోర్ వెల్లడించారు
*కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకం కింద ఉత్తర కర్నాటకలోని బీదర్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూపు చేపట్టి నిర్వహించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జీఎంఆర్ గ్రూపు సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. బీదర్ నుంచి బెంగుళూరుకు తొలి విమాన సర్వీసును ఈ వారంలో మొదలు పెట్టనున్నట్లు, తద్వారా బీదర్ విమానాశ్రయ కార్యకలాపాలను లాంఛనంగా ప్రాంభించినట్లు అవుతుందని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సౌత్) ఎస్జీకే కిషోర్ వెల్లడించారు
*బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను కొత్త రేట్ల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, 30-40 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. ఎవరైతే డిడక్షన్లు, మినహాయింపుల కోసమే పెట్టుబడి పథకాలు తీసుకోవాలని అనుకోరో.. వాళ్ల చేతిలో మరింత డబ్బులు మిగులుతాయని వెల్లడించారు. తక్కువ పన్ను రేట్లు కావాలంటే.. ప్రస్తుతమున్న మినహాయింపులు, డిడక్షన్ వెసులుబాటులను వదులుకొని కొత్త పన్నుల విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని బడ్జెట్ కల్పించిందని అన్నారు