DailyDose

రియల్ రంగానికి భారీ ఊరట-వాణిజ్యం

Real Estate Field Gets Exemptions-Telugu Business News

* రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యధాతధంగా ఉంచింది. అందరూ ఊహించినట్లు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రేపో రేటు 5.51 శాతం వద్ద రివర్స్ రేపో పెటును 4.90 శాతం వద్దే ఉంచింది. గురువారం ముగిసిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
* ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.38గంటల సమయంలో నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 12,132 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 41,283 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్‌, ఐటీసీ, టీసీఎస్‌లు లాభాల్లో కొనసాగుతుండగా..డీమార్ట్‌ షేర్లు దాదాపు 4శాతం లాభాల్లో ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లోనే అవెన్యూ సూపర్‌ మార్ట్‌ షేర్లు టాప్‌20కంపెనీల్లో ఒకటిగా మారిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఐటీఐ షేర్లు 10శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
* ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ సహ వ్యవస్థాపకుడు, వైస్‌ ఛైర్మన్‌ ఫ్రాన్సిస్కో డిసౌజా కంపెనీ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఎందుకు వైదొలగుతున్నారనే దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. మార్చి 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా కంపెనీ సీఈవోగా బయటి వ్యక్తైన బ్రెయిన్‌ హాంఫ్రీస్‌ను తీసుకొచ్చిన ఏడాది తర్వాత డిసౌజా నిష్క్రమిస్తున్నారు. 2007 నుంచి 2019 మార్చి వరకు కాగ్నిజెంట్‌ సీఈవోగా డిసౌజా ఉన్నారు. ఆ పదవికి ఆయన రాజీనామా చేయడంతో బ్రెయిన్‌ను సీఈవోగా నియమించారు
*కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థ లు వాటాదారులు, యూనిట్ హోల్డర్లకు చెల్లించే ఆదాయంపై తలపెట్టిన మూలంలో పన్ను కోత (టీడీఎ్స)పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అవి చెల్లించే డివిడెండ్ ఆదాయానికి మాత్రమే టీడీఎస్ వర్తిస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది.
* ఒక పక్క విత్తలోటు లక్ష్యాన్ని బడ్జెట్లో 3.8 శాతానికి పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం మరోసారి సవాలు విసురుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలల కాలానికి అనుసరించనున్న ద్రవ్య పరపతి విధానంపై చర్చకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సారథ్యంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 11.45కి ఎంపీసీ.. రాబోయే రెం డు నెలల కాలానికి అనుసరించనున్న ద్రవ్య విధానాన్ని, రెపో రేటుపై తన వైఖరిని ప్రకటిస్తుంది.
*రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవ స్థ వృద్ధి రేటు 5.5 శాతం ఉంటుందని బడ్జెట్లో చేసిన ప్రకటన అత్యాశతో కూడుకున్నదని మూడీస్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారత ఆర్థిక రంగం వ్యవస్థాగతంగా, చక్రీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఆ లక్ష్యాన్ని చేరడం అనుమానాస్పదమేనని తెలిపింది.
*భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే రుణాలను అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. మంగళవారం నాడిక్కడ అత్యాధునిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేసిన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ను బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు.
*దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీని స్టాక్మార్కెట్లో లిస్టింగ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లక్ష మంది ఎల్ఐసీ ఉద్యోగులు మధ్యాహ్నం ఒక గంటసేపు వాకౌట్ నిరసన చేశారు. యూనియన్ల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని ఎల్ఐసీ కార్యాలయాల్లోనూ ఈ వాకౌట్లు జరిగాయి.
*సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించింది. భారత్లో ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో ఇన్నోవేషన్ హబ్ ఉంది. అమెరికాలో 11 ఇన్నోవేషన్ కేంద్రాలతో పాటు టొరెంటో, షింజెన్, టోక్యో, జ్యూరిచ్తదితర నగరాల్లో కూడా కంపెనీకి ఇన్నోవేషన్ కేంద్రాలు ఉన్నాయని.. తాజాగా వాటి సరసన హైదరాబాద్ చేరుతుందని యాక్సెంచర్ టెక్నాలజీ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాస్కర్ ఘోష్ తెలిపారు. ఆసియా-పసిఫిక్లోనే మొదటిసారిగా హైదరాబాద్లోని ఇన్నోవేషన్ హబ్లో యాక్సెంచర్ నానో ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది.
*డేటా, ఎనలిటిక్స్ రంగంలోని సాఫ్ట్వేర్ సేవల కంపెనీ.. ఎక్స్పీరియన్ హైదరాబాద్లో డెవల్పమెంట్ సెంటర్ (ఐడీసీ)ను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ దీన్ని ప్రారంభించారు.