DailyDose

దుబాయి గోల్డ్ బిస్కెట్ల అక్రమ రవాణా-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Vizag Police Seize Gold Biscuits Smugglers

*జిలకర్రా బెల్లం పెట్టె సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదని నిరాకర్రించింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తపేట మండలం చర్లపల్లిలో చోటు చేసుకుంది.
* కృష్ణా జిల్లాలోని ముసునూరు మండలం చెక్కపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పురుగుమందు తాగేందుకు రైతులు సిద్ధమయ్యారు. చెక్కపల్లిలో ఇళ్ల స్థలాల కోసం అరటి తోటలను ధ్వంసం చేసి తహసీల్దార్ మోహన్‌రావు దగ్గరుండి మరీ చదును చేయిస్తున్నారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న రైతులు వారిని అడ్డుకున్నారు. పంట భూములను ఇళ్ల స్థలాలుగా మారిస్తే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు చెబుతున్నారు.అయితే.. తనకు కూడా పురుగుల మందు ఇవ్వాలని తహసీల్దార్‌ అనడంతో.. రైతులు ఇవ్వబోయారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చేసేదేమీ లేక పనులు నిలిపివేసిన తహసీల్దార్‌ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్‌ తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కావడంతో స్థానికలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
* సూర్యాపేట జిల్లా చిలుకూరు మిట్స్ కాలేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిరపకాయల కూలీకి చిలుకూరు నుంచి మల్లారెడ్డి గూడెంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* పోలీసులు తమ పొలంలో దౌర్జన్యంగా చేతిపంపు వేయించడాన్ని నిరసిస్తూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కడప జిల్లా సీతంపల్లెలో నివాసమంటున్న వెంకట సుబ్బయ్యశిరీష దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీతంపల్లిలో తమ స్థలంలో పోలీసులు దౌర్జన్యంగా చేతిపంపు వేయించారని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
* ఇద్దరు బాలికలను ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్న ఓటీవీ యాంకర్ పై పోలీసుకేసు నమోదైంది. శిశు సంక్షేమ కమిటీ(CWC) ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను పండుగ సెలవులు వచ్చినప్పుడు వాళ్ల తల్లి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. దీంతో పాటు ఓ టీవీయాంకర్ ఇంట్లో పనిలో పెట్టింది. అయితే సెలవులు పూర్తైనా పిల్లలు తిరిగిరాకపోయే సరికి సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేయగా… హైదరాబాద్‌లోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. పిల్లలతో ఇంటిపని, బాడీ మసాజ్ లాంటి పనులు యాంకర్ చేయించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సదరు యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
* ఎల్బీనగర్ పీఎస్ పరిధి నాంచారమ్మ బస్తీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక నాంచారమ్మ బస్తీకి చెందిన శ్రీధర్(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింట్లో ఉండే దంపతులే తన ఆత్మహత్యకు కారణమని.. వారే తన జీవితాన్ని నాశనం చేశారని శ్రీధర్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
* మాజీ మంత్రి దేవినేని ఉమా బంధువు గద్దె వీరభద్రరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘం భవనంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్‌ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. సహకార పరపతి సంఘంలో తాను లోను తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించే బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరకలపాడు సహకారం సంఘంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
* తన ప్రేమను నిరాకరిచిందని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* ప్రమాదావశాత్తు ఇద్దరు రైతులు బావిలో పడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నిన్న తడ్వాయి మండలం కన్‌కల్‌ గ్రామంలో చోటుచేసుకుంది.
* తిరుమలగిరి మండలం రాఘవాపురంలో దారుణం జరిగింది. ఉన్మాది వెంకటేశ్‌.. యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో యువతిని వెంకటేశ్‌ వేధిస్తున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించడంతో ఉన్మాది ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* విశాఖ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న పది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.51.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
* జూబ్లీహిల్స్‌ లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ 29న ఉదయం 11 గంటలకు ఆయన నివాసం ముట్టడించాలని నిర్ణయించినట్లు అమరావతి యువ జేఏసీ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
*ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలను నిరోధించేందుకు బీహార్ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల పై ఫిర్యాదు చేసిన ప్రజలకు వెయ్యి రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ ప్రకటించారు.
* విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ ప్రయాణికుడి నుంచి 10 గోల్డ్‌ బిస్కెట్లు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.51.5 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.
*పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న రైలును బస్సు ఢీకొట్టిన ఘటనలో కనీసం 20 మంది మృతిచెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సింధ్‌ ప్రావిన్సులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రావల్పిండి నుంచి కరాచీ వెళుతున్న రైలును ఓ క్రాసింగ్‌ వద్ద బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కొంతమంది పిల్లలు సహా కనీసం 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
*కొత్తూరు ఎస్సై బాలస్వామి, ఏఎస్సై వెంకటేష్‌‌పై బదిలీ వేటు పడింది. హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం దగ్గర ఓ వెంచర్‌లో జరిగిన ఓ విందులో నాగిని డ్యాన్స్‌ చేస్తూ హల్‌చల్ చేశారు. ఈ వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వారిపై బదిలీ వేటు వేశారు. పోలీస్ శాఖలో గ్రూప్ తగాదాలే కారణమని అనుమానిస్తున్నారు.
*బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్కాట్లాండ్ యార్డ్ అధికారులు మృతుడిని సందీప్ ఘుమన్‌(36)గా గుర్తించారు. సందీప్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతోనే అతను చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఫిబ్రవరి 18న ఆగ్నేయ లండన్‌లోని బెల్మ్‌ర్ష్ హెచ్ఎం జైలులోని తన సెల్‌లో సందీప్ తలపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో జైలు సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తరువాతి రోజు సాయంత్రం అతను చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.
*కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన దేశ్ముఖ్ శివదాస్(15) స్థానిక కుండాయి జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
*రాత్రి పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి.. తల్లిదండ్రులు బయట మాట్లాడుకుంటున్నారు.. అంతలోనే ఇంటి గోడ కూలి.. నిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా… మరో చిన్నారిని దవాఖానకు తరలించే లోపు మృతి చెందింది. వారి బంధువు కూతురుకు చేతి వేళ్లు విరిగి పోయాయి. ఈ హృదయ విదారక ఘటన హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్సాగర్లో చోటు చేసుకుంది.
*ఆమ్లేట్ వేయలేదనే కోపంతో తాగిన మత్తులో భార్యను రోకలితో కొట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత కారాగారా శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి తీర్పు చెప్పారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ తెలిపారు.
*వేమనపల్లి మండలంలోని ముల్కలపేట గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన కామెర లింగయ్యకు స్పెషల్ 6వ అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు (మహిళ కోర్టు ఆదిలాబాద్) జడ్జి జయప్రసాద్ శుక్రవారం 2 నెలల జైలుశిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించినట్లు నీల్వాయి ఎస్ఐ భూమేష్ శుక్ర వారం తెలిపారు. మహిళపై లింగయ్య అత్యాచారయత్నం చేయ డంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి తీర్పునిచ్చినట్లు ఎస్ఐ తెలిపారు
*భార్యపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డ కేసులో ఆమె భర్త గిరుగుల శేఖర్కు శుక్రవారం 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ సబ్కోర్టు న్యాయమూర్తి కనకదుర్గ తీర్పునిచ్చినట్లు బెల్లంపల్లి 2వ పట్టణ ఎస్సై భాస్కర్రావు తెలిపారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై భాస్క ర్రావు తెలిపిన ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలోని గంగారాం నగర్కు చెందిన గిరుగుల శేఖర్, అతని భార్య గిరుగుల రవళికి 2012లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని కిరోసిన్ పోసి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకొని పారిపోయి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది.
*పాతమిత్రుడని మాట్లాడితే అతి చనువు చూపాడు.. చివరకు అది రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఇద్దరు మృతికి కారణమైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడు శవమై తేలగా.. మహబూబ్నగర్లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
*జగిత్యాల జిల్లా మల్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఓ నిందితుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… 2017లో కొండగట్టు ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పెంట సాగర్ నిందితుడు. అతడిని పోలీసులు విచారణ కోసం మల్యాల సీఐ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
*పసిడి ధరలు రోజురోజుకూ పైపైకి వెళ్తుండడంతో బంగారం స్మగ్లర్లు అడ్డదారిలో దాని దిగుమతిపై దృష్టి సారిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించడానికి స్మగ్లర్స్ ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుంచి పేస్ట్ రూపంలో మార్చిన 826 గ్రాముల బంగారాన్ని బూట్ల సాక్సుల్లో తరలిస్తూ భద్రతాధికారులకు పట్టుబడ్డారు.
*గోపన్పల్లిలోని సర్వే నం.127లో వివాదాస్పద భూముల వ్యవహారంపై పలువురు బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు. రాజోలి ఎస్సీ హౌసింగ్ సహకార సంఘం సభ్యులు శుక్రవారం రాజేంద్రనగర్లోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో విచారణాధికారి, ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదులు అందించారు.
*కోర్టు ధిక్కరణ కేసులో మంచిర్యాల అటవీ శాఖాధికారులకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. మంచిర్యాల డివిజినల్ ఫారెస్ట్ అధికారి డి.రామలింగం, బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి విజయకుమార్ సాహల్, డిప్యూటీ రేంజ్ అధికారి, అకినేపల్లి ఇన్ఛార్జి బీట్ అధికారి సతీష్కుమార్లకు రెండేసి నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధించింది.
*గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు సమీపంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో బాలుడు (17) మృతి చెందాడు.
*తీవ్ర సంచలనం సృష్టించిన ‘పుల్వామా ఉగ్రదాడి’ కేసు దర్యాప్తులో కీలక మలుపు. ఈ ఘటనలో కీలక సూత్రధారి, జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాది షకీర్ బషీర్ మగ్రేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, అతడికి 15 రోజుల రిమాండ్ విధించింది.
*అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే అతడి ప్రేయసిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వింత సమాధానం వచ్చింది. దాగుడుమూతలు ఆడే క్రమంలోనే తన ప్రియుడు మరణించాడని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది.
*తన అన్నయ్య కొడుకు చనిపోయాడనే ఆవేదనతో బాబాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలంలోని చిప్పాడ గ్రామంలో చోటు చేసుకుంది.