ScienceAndTech

మైక్రోసాఫ్ట్ బోర్డుకు బిల్‌గేట్స్ గుడ్‌బై

Bill Gates Log Out Of Microsoft Board

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ బోర్డు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై మరింత విస్తృతంగా దృష్టి సారించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. బిల్ సారథ్యంలో మైక్రోసాఫ్ట్ బోర్డు ఎంతో లాభపడిందని, ఎన్నో నేర్చుకుందని ఆయన లేని లోటు భర్తీ చేయడానికి వీలుకానిదని ఆయన పేర్కొన్నారు.