NRI-NRT

సియాటెల్‌లో మొదటి విడత కొరోనా టీకా

seatlle-doctors-administer-first-phase-of-corona-vaccine-by-niaia-moderna-సియాటెల్‌లో మొదటి విడత కొరోనా టీకా

అమెరికా జాతీయ అంటురోగ నివారణ, పరిశోధన సంస్థ(NIAID-NIH), మోడెర్నా బయోటెక్నాలజీలు సంయుక్తంగా రూపొందించిన కొరోనా నిరోధక టీకాను అమెరికాలోని సియాటెల్ వైద్యులు సోమవారం నాడు 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలపై విజయవంతంగా ప్రయోగించారు. నెలరోజుల విరామంతో రెండు విడతలుగా ఇచ్చే ఈ టీకాను అందుకున్న 43 ఏళ్ల మహిళ జెన్నిఫర్ హాలర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదుపేస్తున్న ఈ మహమ్మారిపై పోరుకు రూపొందించిన ఈ ఆయుధాన్ని తనపైన పరీక్షించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కైసర్ పెర్మానంటే ఆసుపత్రిలో ఈ టీకాలను డా.లీసా జాక్సన్ నేతృత్వంలో అందిస్తున్నారు. వీరిపై టీకా ప్రభావాన్ని అంచనా వేసిన అనంతరం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో 81మంది మృతి చెందగా సియాటెల్‌లో అత్యధికంగా 43మంది మరణించారు.