Agriculture

సెంచరీ కొట్టిన అమరావతి ఉద్యమం

Amaravati Farmers Protest Reaches 100Day

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలో రైతులు అలుపెరగని ఉద్యమం చేస్తున్నారు. బతుకు కోసం.. భవిష్యత్తు కోసం రైతులు చేపట్టిన అమరావతి ఉద్యమం నేటికి వందో రోజుకు చేరింది. ఎప్పుడూ గడదాటని మహిళలు పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. లాఠీ దెబ్బలు, పోలీసు కేసులు, బెదిరింపులను సైతం లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలుగు వారు ఎంతో సందడిగా జరుపుకునే పండుగల్లోనూ తమ పోరాటం ఆపలేదు. అమరావతి ఉద్యమంలో పలువురు రైతులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో వైరస్‌ సోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దీక్షా శిబిరాల వద్ద మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరికొందరు వీధుల్లోను, ఇళ్ల వద్దే ఉద్యమాన్ని కొనసాగిస్తు్న్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనను విమరించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు తేల్చి చెప్పారు.