Sports

నిరాశ కలిగించింది

నిరాశ కలిగించింది

టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడం తీవ్ర నిరాశను కలిగించిందని భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చెప్పింది. ‘‘ప్రతి ఒక్క అథ్లెట్‌ భయపడిందే నిజమైంది. ఒలింపిక్స్‌లో పోటీపడడం చాలా కఠినమైన పరీక్ష. కానీ ఆ పోటీపడే అవకాశం కోసం సుదీర్ఘ కాలం వేచి చూడడం ఇంకా కష్టం. ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంపై ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు. క్రీడాకారులకే కాదు ప్రపంచానికి ఇదో క్లిష్ట సమయం. ఏదేమైనా ఒలింపిక్స్‌ వాయిదా తీవ్ర నిరాశను కలిగించింది. అందరూ ధైర్యంగా ఉండి ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు పోరాడాలి. లక్ష్యంపై తిరిగి దృష్టి సారించాలి’’ అని వినేశ్‌ చెప్పింది.

Vinesh Phogat locks Olympic quota with bronze at Wrestling World ...