Movies

అల్లు…అద్భుతం…ఆశ్చర్యం..

Disha Pathani About Allu Arjun-Telugu Movie News

బుట్ట‌బొమ్మ పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా మార్మోగిపోయిన విష‌యం గుర్తుండే ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురం సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌గా రికార్డు సృష్టించాయి. ఇక బుట్ట‌బొమ్మ పాట‌కు బాలీవుడ్ తార‌లు సైతం స్టెప్పులేసి సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీకి ఆశ్చ‌ర్యం, అనుమానం ఒకేసారి క‌లిగాయి. ఈ పాట‌లో అంత‌ బాగా ఎలా డ్యాన్స్ చేయ‌గ‌లిగార‌ని బ‌న్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌శ్నించింది. దీనికి మ‌న హీరో స‌మాధాన‌మిస్తూ “నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ మంచి మ్యూజిక్ దొరికితే డ్యాన్స్ చేయ‌కుండా ఉంటానా.. మీ ప్ర‌శంస‌కు ధ‌న్య‌వాదాలు” అంటూ రిప్లై ఇచ్చాడు.