Fashion

WFH వలన మహిళలపై పెరిగిన గృహహింస

Telugu LifeStyle News - Domestic Violence Increased On Women Due To COVID19 RemoteWork

రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ కొందరు మహిళలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇళ్లకే పరిమితమవుతున్న కొందరు పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తూ గృహహింసకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వారం వ్యవధిలో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కి మొత్తం గృహ హింసకు సంబంధించి 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాల నుంచే, ముఖ్యంగా పంజాబ్‌ నుంచే వచ్చాయని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ తెలిపారు.