Food

మాంసం వాసన రాకుండా ఉండాలంటే పసుపు రాయండి

To avoid meat smelling bad, wash it with turmeric-telugu food tips

* కోడిమాంసం, రొయ్యలు సహజంగా నీచు వాసన వస్తుంటాయి. వండే ముందు వీటికి కొంచెం పసుపు రాసి పక్కన పెడితే వాసన రావు.
* ఆమ్లెట్‌ వేసేటప్పుడు ఆ మిశ్రమంలో ఒక స్పూన్‌ శనగపిండి వేస్తే ఆమ్లెట్‌ చక్కగా వస్తుంది. మంచి రుచి కూడా ఉంటుంది.
* పచ్చి మిరపకాయల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మిరపకాయల తొడిమలు తీసేసి గాజు సీసాలో వేసి వాటిపై కాస్త పసుపు చల్లి మూత బిగిం చి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి.
* గోధుమ పిండి, శనగపిండి, బియ్యంపిండిలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఓ మంచి గుడ్డముక్కలో కాస్త ఉప్పు వేసి వాటిలో పెడితే పురుగు పట్టకుండా ఉంటాయి.
* ప్లాస్టిక్‌ డబ్బాలో నెయ్యి, నూనె, వనస్పతి పేరుకుపోయి కడగడం ఇబ్బందైతే ఆ డబ్బాలో కాస్తంత వేడి నీళ్లు పోస్తే గడ్డ కట్టినది పైన పేరుకుపోతుంది.
* నిమ్మకాయలు అన్నిసందర్భాల్లో దొరకవు. అందుకని దొరికినప్పుడే కొనేసి ఒక బాటిల్‌లో రసం పిండుకొని భద్రపర్చాలి. ఐస్‌ ట్రేలో నిమ్మరసాన్ని పోసి ఒక రోజంతా ఉంచితే ఐస్‌ లెమన్‌ క్యూబ్స్‌ తయారవుతాయి. వాటిని జిప్‌ లాక్‌ బ్యాగ్‌లో పెట్టుకొని ఫ్రిజ్‌లో భద్రపర్చుకోవాలి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్‌ లెమన్‌ క్యూబ్స్‌ వాడుకోవచ్చు.