Sports

టూర్ డీ ఫ్రాన్స్ కూడా కరోనాకు సమర్పయామీ

Tour De France Cancelled Due To Coronavirus

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో క్రీడా టోర్నీల‌న్ని వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్నాయి. విశ్వ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే ప‌లు టోర్నీలు పోస్ట్‌పోన్ కాగా.. తాజాగా ఈ జాబితాలో టూర్ డి ఫ్రాన్స్ కూడా చేరింది. ఈ టోర్నీని ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 20 మ‌ధ్య నిర్వ‌హించాల‌ని అంత‌ర్జాతీయ సైక్లింగ్ యూనియ‌న్ (యూసీఐ) పేర్కొంది. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 27 నుంచి జూలై 19 మ‌ధ్య జ‌రుగాల్సిన టోర్నీని కోవిడ్‌-19 కార‌ణంగా వాయిదా వేసిన‌ట్లు నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేంత‌వ‌ర‌కు ఈ పోటీలు నిర్వ‌హించే ప్ర‌సక్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.