ScienceAndTech

కాగ్నిజెంట్‌పై వైరస్ దాడి

కాగ్నిజెంట్‌పై వైరస్ దాడి

‘మేజ్‌’ రాన్సమ్‌వేర్‌ దాడితో ఇబ్బందులకు గురైనట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ వెల్లడించింది. దీని వల్ల తమ ఖాతాదారుల్లో కొంతమందికి అందించే సేవలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. కాగ్నిజంట్‌ కంపెనీకి భారత్‌లో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. ‘మేజ్‌’ రాన్సమ్‌వేర్‌ దాడికి సంబంధించిన సమాచారాన్ని కాగ్నిజంట్‌ తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు చేరవేయడంతో పాటు వారికి రక్షణాత్మక సాంకేతికత అందించినట్లు తెలిపింది. ప్రముఖ సైబర్‌ రక్షణ సంస్థలతో అనుసంధానమైన తమ అంతర్గత భద్రతా బృందాలు ఈ దాడిని నిరోధించడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు కాగ్నిజంట్‌ స్పష్టం చేసింది. ఖాతాదారులు తమ కంప్యూటర్‌ వ్యవస్థ, డేటాను వినియోగించకుండా రాన్సమ్‌వేర్‌ అడ్డుపడుతుంది. వినియోగించుకోవాలంటే, డబ్బులు చెల్లించాలని అక్రమార్కులు డిమాండ్‌ చేస్తుంటారు. దీనిపై చట్టపరమైన చర్యలకూ కాగ్నిజంట్‌ సిద్ధమవుతోంది.