Movies

జనాలు ఎలా ఉంటారో!

Bhumi Pednekar Worried Post-LockDown Conditions

‘‘కరోనా సృష్టించిన కల్లోలంతో ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. నెల క్రితం ఉన్న పరిస్ధితులు ఇప్పట్లో రావడం ప్రశ్నార్థకమే’’ అని భూమీ పడ్నేకర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో భూమీ హైడ్రోపొనిక్‌ ఫార్మింగ్‌, వంట చేయడం, పుస్తక పఠనంపై దృష్టిపెట్టారు. ఆమె మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌ పూర్తి కాగానే మహమ్మారి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను పక్కనపెట్టేసి గడచిన రోజుల్ని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో ఈ జనం ఉంటారు. అది చాలా ప్రమాదకరం. లాక్‌డౌన్‌ తర్వాత జనాల తీరు ఎలా ఉంటుందోనన్న భయం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా కోలుకోవాలని అన్న దానిపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా రోజువారీ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారి పరిస్థితి కొన్నాళ్లదాకా ప్రశ్నార్థకమే! కష్టంలో ఉన్న వ్యక్తికి డబ్బు ఇస్తే సాయం చేసినట్లు కాదు. అండగా నిలబడాలి’’ అని అన్నారు.