DailyDose

షాద్‌నగర్‌లో హై అలెర్ట్-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona Bulletin - New Corona Virus Cases In Shadnagar

* కేరళలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 275కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 515మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్య శాఖ వెల్లడించింది.

* కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న సాయంత్రం 5గంటల నుంచి ఈ సాయంత్రం 5 గంటల దాకా అక్కడ 216 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1959కి పెరిగింది. ఈ రోజు కొత్తగా 11మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 608కి చేరింది. కర్ణాటకలో కొవిడ్‌ బారిన పడి 42మంది మరణించారు.

* కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

* జులై 4న ఈసెట్‌
* జులై 13న ఐసెట్
* జులై 15న ఎడ్‌సెట్‌,
* జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌
* జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌;
* జులై 1న పాలీసెట్‌

* రాబోయే పది రోజుల్లో దాదాపు 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్‌ రూపొందించినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. వీటి ద్వారా 36లక్షల మందిని తరలించనున్నట్టు చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కావాలని అడిగితే.. రైళ్లు నడిపేందుకు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నామని తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి మే 22 వరకు రైల్వే శాఖ 9.7 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను నిరంతరాయంగా రవాణా చేసిందని తెలిపారు.

* ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చు అని డీజీపీ తెలిపారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది.

* కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు మెయిన్ రోడ్, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఏలాంటి రాకపోకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

* కోవిడ్‌ విపత్తు నివారణా చర్యలకు మరిన్ని అడుగులుఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది వెంటనే భర్తీవిశాఖ, ఈస్ట్‌గోదావరి, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌స్థాయి వరకూ కోవిడ్‌ టెస్టింగ్‌ శాంపిళ్లు సేకరణ, ప్రయోగాత్మకంగా అమలు8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న దానికంటే… ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్య పెంపుసీఎం అధ్యక్షతన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో నిర్ణయాలుకోవిడ్‌ సోకడం నేరం, పాపం కాదుకోవిడ్‌పట్ల ఉన్న స్టిగ్మా (భయాందోళన)ను తొలగించాలివైరస్‌ ఎవరికైనా వ్యాపిస్తుందిపరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలికనీసజాగ్రత్తలతో, వైద్యసహాయంతో కోలుకోవడం సులభంఈమేరకు ప్రజల్లో అవగాహన కలిగించాలి – సీఎం ఆదేశాలు

* మే 1 నుంచి శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడిపామనీ.. ప్రయాణికులందరికీ ఉచితంగా భోజనం, తాగునీరు అందించినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో భౌతికదూరం, పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించినట్టు తెలిపారు. ఇప్పటిదాకా ఈ రైళ్లలో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల్లో 80శాతం మంది యూపీ, బిహార్‌కు చెందినవారేనన్నారు. కరోనా కేర్‌ సెంటర్ల కోసం 80వేల పడకలతో 5వేల కోచ్‌లను సిద్ధంచేసినట్టు తెలిపారు. వీటిలో కొన్ని వినియోగంలోకి తీసుకురాలేదని చెప్పారు.

* దేశంలో లాక్‌డౌన్‌తో పలు చోట్లచిక్కుకున్న వారిని స్వస్థలాలకు తరలించేందుకు 2600లకు పైగా శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడిపినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ రైళ్ల ద్వారా 35లక్షల మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లారని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ వెల్లడించారు.

* రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీ స్థాయి వరకు టెస్టింగఠ్‌లు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. కొవిడ్‌ టెస్టింగ్‌ శాంపిళ్ల సేకరణ ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. ఎనిమిది జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సూచించారు. ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
షాద్‌నగర్‌లో హై అలెర్ట్-TNI కరోనా బులెటిన్