Business

15వేల మంది ఊస్టింగ్

Renault cuts 15000 jobs

ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫ్రాన్స్‌ కార్ల తయారీ సంస్థ రెనో ప్రకటించింది. ఇందులో 4,600 మందిని ఫ్రాన్స్‌లో, మరో 10,000 మందికి పైగా ఇతర దేశాల్లో తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. మూడేళ్లలో 200 కోట్ల యూరోల (సుమారు రూ.16800 కోట్ల) మేర వ్యయాలు తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఇవి అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. 2019లో సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కార్లను తయారు చేయగా, 2024కు ఈ సంఖ్యను 33 లక్షలకు పరిమితం చేయనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.80 లక్షల మంది ఉద్యోగులున్నారు.