DailyDose

హైదరాబాద్ సంస్థ నుండి కరోనా మందు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin || Hetero Gets Permission To Make Corona Medicine

* కరోనా చికిత్స కోసం రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ రెడీ… అనుమతులు దక్కించుకున్న హైదరాబాద్ సంస్థఓవైపు కరోనా మహమ్మారి శరవేగంతో వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేది కష్టమేనని తెలుస్తోంది. దాంతో చికిత్సలో ఉపయోగించే సమర్థవంతమైన ఔషధాల తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ పేరుతో ఫావిపిరావిర్ టాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్లెన్ మార్క్ కు అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు, కరోనా చికిత్సలో ఓ ఇంజెక్షన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమేరకు అనుమతులు ఇచ్చింది.ఆ మందు పేరు రెమ్ డెసివిర్. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్ కు చెందిన హెటెరో ఫార్మా సంస్థ తయారుచేస్తోంది. మరో ఫార్మా సంస్థ సిప్లా కూడా ఈ ఔషధానికి అనుమతులు దక్కించుకుంది. కోవిఫర్ తయారీకి, మార్కెటింగ్ కు డీజీసీఐ సిప్లా, హెటెరో సంస్థలకు క్లియరెన్స్ ఇచ్చింది.కాగా, హెటెరో సంస్థ ఇప్పటికే లక్ష డోసులు సిద్ధం చేసింది. ఇంజెక్షన్ రూపంలో ఉన్న ఈ యాంటీ వైరల్ డ్రగ్ నేటి నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 100 ఎంఎల్ పరిమాణంలో ఉన్న ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. హెటెరో వర్గాలు దీనిపై మాట్లాడుతూ, కరోనా లక్షణాలన్నింటిపైనా కోవిఫర్ సమర్థవంతంగా, సమగ్రంగా పనిచేస్తుందని తెలిపాయి. కరోనా చికిత్సలో తొలిరోజున ఒక 200 ఎంజీ డోసు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆపై ఐదు రోజుల పాటు 100 ఎంజీ డోసు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించాయి.వాస్తవానికి రెమ్ డెసివిర్ ఔషధం తాలూకు పేటెంట్ హక్కులు అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ ఫార్మా సంస్థ వద్ద ఉన్నాయి. ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సిప్లా, హెటెరో సంస్థలు భారత్ లో కోవిఫర్ పేరుతో ఇంజెక్షన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.హెటెరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి దీనిపై స్పందిస్తూ… క్లినికల్ ట్రయల్స్ లో కోవిఫర్ సానుకూల ఫలితాలు ఇచ్చిందని, తమకు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇప్పటినుంచే భారత్ లోని కరోనా రోగులందరికీ అందుబాటులోకి ఈ ఔషధాన్ని తీసుకువస్తామని తెలిపారు.

* రాష్ట్రంలో  కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.తాజాగా ఆదివారం 477 కేసులు నిర్ధారణ అయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8929 కి చేరింది.  ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రానికి చెందివారు 7059 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1540 మంది. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 330 మంది కరోనా సోకింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదు మంది మృతి చెందగా…రాష్ట్రంలో ఇప్పటివరకు  ఈ సంఖ్య 106కి చేరింది.వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,307గా ఉంది.ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,516  మంది చికిత్స పొందుతున్నారు.

* తెలంగాణలో భారీగా పెరిగిన కేసులుతెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది.ఇవాళ ఒక్కరోజే 546 కేసులు వెలుగుచూశాయి.ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 458 కేసులు మరియు రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7072కి చేరింది.గడిచిన 24 గంటల్లో మరో 5 మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 203కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,506కి పెరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా 3,363 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

* దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.గడచిన 8 రోజుల్లో లక్ష కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు.గడచిన 24 గంటల్లో అత్యధికంగా 15,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా 306 మంది మృతి.దేశంలో కరోన బాధితుల సంఖ్య 4,10,461 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.1,69,451 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,27,755 మంది బాధితులు.కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 13,254 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 13,925 మంది బాధితులు.

* బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చిల్లర రాజకీయాలు చేస్తోంది.బీజేపీ టీఆరెస్ ప్రభుత్వం పై లేనిపోని-చిల్లర ఆరోపణలు చేస్తోంది.కరోనా టెస్టులు-మరణాల పై టీఆరెస్ ప్రభుత్వం పై పచ్చి అబద్ధాలు జేపీ నడ్డా చేశారు!.ప్రాంతీయ పార్టీల పై బీజేపీ ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరు చూసుకొని మాట్లాడాలి.కరోనా కట్టడికి డే వన్ నుంచి టీఆరెస్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.ఢిల్లీ-పార్లమెంట్ కి కూతవేటు దూరంలో మీరు పట్టించుకోకపోతే, మర్కజ్ కేసులు ట్రేస్ చేసి బయటపెట్టింది తెలంగాణ.కరోనా కట్టడిలో సఫలం అయిన రాష్ట్రం తెలంగాణ.–మంత్రి ఈటెల రాజేందర్

* నూజివీడు పట్టణానికి చెందిన ఒక హోంగార్డు కు కరోనా మహమ్మారి పాజిటివ్ రూపంలో రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. అజరయ్య పేట పాజిటివ్ కేసుల కాంటాక్ట్ లో హోంగార్డుకు వ్యాప్తి చెందినట్లు సమాచారం.ఇతను నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు.