Food

రాగిపిండితో పుల్లపునుగులు

రాగిపిండితో పుల్లపునుగులు

కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 125 గ్రా.

పెరుగు : 50 గ్రా.

ఉల్లిపాయలు : 20 గ్రా.

పచ్చిమిర్చీ : 15 గ్రా.

వాము : 5 గ్రా.

నీళ్ళు : 80 మి.లీ

తయారీ విధానం :మినప్పప్పు, రాగి పిండి రెండూ.. జల్లించి కలపాలి. పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీ, కరివేపాకు, కొత్తిమీర, వాము తగినన్ని నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. బాండ్లీలో నూనె పోసి కాగిన తరువాత పిండివేసి ఎర్రగా వేయించి తీయాలి. ఇవి వేడి మీదనే బాగుంటాయి.

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో):
ప్రొటీన్స్‌ : 6.11 గ్రా.

కొవ్వు : 2.51 గ్రా.

పీచు పదార్థం : 3.51 గ్రా.

పిండి పదార్థం : 43.89 గ్రా.

శక్తి : 222.2 కి.క్యాలరీస్‌

క్యాల్షియం : 323.64 మి.గ్రా.