ScienceAndTech

ఇన్‌స్టాగ్రాంలో టిక్‌టాక్

TikTok Like Service In Instagram

టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రీల్స్‌ పేరుతో గతేడాది నవంబర్‌లో ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో టిక్‌టాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై గతవారం ఇన్‌స్టా స్పందిస్తూ ఇప్పటికే దీనిని ఫ్రాన్స్‌, జర్మనీల్లో పరీక్షించామని పేర్కొంది. దీనిని భారత్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌లో ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లకు దీనిని అందించిందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అందుకే ఈ టెక్నాలజీ అందుకోవాల్సిన దేశాల జాబితాలో భారత్‌ లేదని తెలిపింది. రీల్స్‌లో కూడా 15క్షణాల పాటు వీడియోను చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఆడియోను ఎడిట్‌ చేసుకోవచ్చు.