Health

గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు చేయట్లేదు-TNI బులెటిన్

TG High Court Questions Govt On COVID19 Tests In Gandhi Hospital

* తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుతెన్నులపై హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది.

* అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం లో విజృంభిస్తున్న కరోనామంగళవారానికి 215 చేరిన కరోనా వైరస్ కేసులు సంఖ్య .మంగళవారం ఆర్టీసీ డిఎం తో సహా 15 మందికి కరోనా పాజిటివ్.

* తెనాలి తహసీల్దార్ కు కరోనా పాజిటివ్.దీనితో తెనాలి ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగస్తులుకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.దీనితో తెనాలి లో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల ఆందోళనలో వున్నారు.తెనాలి లో ఇంతకు ముందు మున్సిపాలిటీలో, గవర్నమెంట్ వైద్యశాల, పోలీస్ స్టేషన్ లో వారికి కారోన సోకింది.దీనితో తెనాలి లో ప్రభుత్వ ఉద్యుగులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

* ఏపీలో కొత్తగా 1916 కరోనా పాజిటివ్ కేసుల నమోదు.33,019కి చేరిన కరోనా కేసులు.కరోనా నుండి కోలుకున్న 952 మంది పేషెంట్లు.కొత్తగా 43 మంది మృతి, 408 కి చేరిన మృతుల సంఖ్య.17,467 మంది డిశ్చార్జ్.15,144 మంది కోవొడ్ ఆసుపత్రిలో చికిత్స.

* భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28, 498 కేసులు.. 553 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసులు 9,06,752కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 23,747 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,11,565 మంది చికిత్స పొందుతుండగా.. 5,71,460 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.