Movies

ఉపాసన ఉదారత

ఉపాసన ఉదారత

నెహ్రూ జూపార్కులోని ఆడ ఏనుగు రాణి(82)ని సినీనటుడు రాంచరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ ఉపాసన దత్తత తీసుకున్నారు. సాయంత్రం జూకు చేరుకున్న ఆమె క్యూరేటర్‌ ఎన్‌.క్షితిజను సంప్రదించి జూలోని జంతువుల వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఆడ ఏనుగును దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు ఆ ఏనుగు పోషణ కోసం రూ.5 లక్షల చెక్కును క్యూరేటర్‌కు అందజేశారు.