NRI-NRT

TPAD ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

TPAD Corona Charity Events In Narayanapeta District Of Telangana

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అఫ్ డాలస్ (TPAD) సామాజిక సేవలో భాగంగా నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందిస్తున్న వారికి వెయ్యిడాలర్ల విలువైన N-95 మాస్కులు మరియు శానిటైజెర్లను పంపిణీ చేశారు. విరాళాలు సేకరించి సహకరించిన టీప్యాడ్ సంస్థ నాయకత్వానికి, ఫౌండింగ్ కమిటీ చైర్ రావు కల్వలకి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్ మాధవి సుంకిరెడ్డికి, కో ఆర్డినేటర్ బుచ్చిరెడ్డి గోలికి, అధ్యక్షులు రవికాంత్ రెడ్డి మామిడికి, మాజీ అధ్యక్షులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డికి ఇతర సభ్యులందరికి పెద్దకడుమూరు సర్పంచ్ శశిరేఖ, జగన్ మోహన్ రెడ్డిలు ధన్యవాదాలు తెలిపారు.