Sports

ఏకపక్షంగా రాణించిన జకోవిచ్

టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం రాత్రి ఆర్థర్‌ ఆశే స్టేడియంలో బోస్నియా అండ్‌ హర్జెగోవినా ఆటగాడు డామిర్‌ జుముర్‌తో తలపడిన తొలి రౌండ్‌లో 6-1, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా కేసులు అధికంగా ఉన్నందున ప్రేక్షకులని స్టేడియానికి అనుమతించలేదు. లేకపోతే ఆ స్టేడియం అంతా టెన్నిస్‌ అభిమానులతో నిండిపోయేది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్‌.. ప్రత్యర్థికి ఏ నిమిషంలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. తన డిఫెన్స్‌తో జుముర్‌ను పూర్తిగా కట్టడిచేశాడు. ఈ ఏడాది ఇప్పటికే వెస్టర్న్ అండ్‌ సదరన్‌ ఓపెన్‌లో నాలుగు టైటిళ్లు సాధించిన జకోవిచ్‌ ఈ గెలుపుతో తన గణంకాలను 24-0తో మరింత మెరుగు పర్చుకున్నాడు.