Fashion

వ్యక్తిత్వం అంటే ఏమిటి? వివరించండి.

వ్యక్తిత్వం అంటే ఏమిటి? వివరించండి.

వ్యక్తిత్వం అంటే ఏమిటి ?

ఒక మనిషి యొక్క ప్రవర్తన , ఆలోచన , మాటతీరు , నడవడి అతని మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం అనవచ్చు..

పదిమందిచేత ప్రశంసించబడే వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలి…?

చదువు , సహాయపడే గుణం , దైవ భక్తి , పొరుగువారి పట్ల స్నేహభావం, సున్నితమైన మాటలు, స్వార్ధరహితంగా ఉండటం, ఎవరినీ నొప్పించకుండా ఉండటం …….

ఇక్కడే మనకు భగవద్గీత ఈ క్రింది విధంగా చెప్తోంది

భయము లేకుండుట,
అంతఃకరణమందు నిర్మలత్వము,
తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి ,సాత్వికమైన దానము,ఇంద్రియ నిగ్రహము,
దైవ, గురుపూజనము,
అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము,
స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, శరీరమున, అంతః కరణమున,ఇంద్రియములయందు సరళత్వము,మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కొమలత్వము,
లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమా, ధైర్యము, ……

ఇవి భగవద్గీత ప్రకారం మంచి వ్యక్తిత్వ లక్షణాలు.💐🙏