Food

తాటి ముంజల రసం…భలే భలే!

తాటి ముంజల రసం…భలే భలే!

కావాల్సినవి: ముంజలు- మూడు, పంచదార- మూడు టేబుల్‌ స్పూన్లు, నిమ్మకాయ- ఒకటి.
తయారీ విధానం: ముంజలు, పంచదార, నిమ్మరసం, కాసిన్ని నీళ్లు జ్యూసర్‌లో వేసుకుని జ్యూస్‌ చేయాలి. దీన్ని గ్లాసులో పోసి ఐస్‌ముక్కలు వేస్తే రుచికరమైన జ్యూస్‌ సిద్ధమవుతుంది.

తాటిముంజల ఉపయోగాలు

* తాటిముంజల్లో ఉండే సోడియం, పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్‌ సమతుల్యతను కాపాడటంలో సాయపడతాయి. ఎండ, వేడిమి కారణంగా మనం కోల్పోయిన పోషకాలని తిరిగి అందిస్తాయి.
* చర్మం పొడిబారే సమస్య నుంచి కాపాడి నిగారింపుని అందిస్తాయి. మనలోని అలసటను పోగొడతాయి.
* దాహాన్ని తగ్గించి రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
* వీటిలోని నీరు చలువ చేస్తుంది. ఇది పిల్లలకు, వృద్ధులకు ఎంతో మంచిది.
* ముంజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యను నివారిస్తాయి.
* వాంతులు, వికారంగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
* వీటిలో నీరు అధికంగా ఉండటం వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని తీసుకోవచ్చు.
* వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి చర్మ సంబంధ సమస్యలెన్నో వస్తాయి. అలాంటి సమస్యలను వీటిని తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.