Kids

తన చెప్పు తానే కొనుక్కున్న నిజాం నవాబు

తన చెప్పు తానే కొనుక్కున్న నిజాం నవాబు

ఒక్క చెప్పు…?
(ఒక అద్భుతమైన సంఘటన.)

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది…?

బెనారస్ హిందూ యూనివర్సిటీ!

దాన్ని ఎవరు స్థాపించారు?

మదన్ మోహన్ మాలవీయ
ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు…!

ఆయన్ని చాలా మంది “నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి” అని హాస్యమాడేవారు కూడా…!

అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు.
ఇదే క్రమంలో ఆయన నిజాం దగ్గరకి వెళ్లారు.
నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి…!

” నీకెంత ధైర్యం…హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా” అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా…
మాలవీయ మారు మాట్లాడలేదు…!

ఆ చెప్పును కళ్లకద్దుకుని “మహా ప్రసాదం” అంటూ బయటకి వచ్చేశాడు.
బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు.
నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు…!

పోటీ పెరిగింది. వేలం మొదలైంది.
ఈ సంగతి నిజాం చెవిన బడింది.
నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే పరువునష్టం. ఆ చెప్పు మాలవీయ చేతికి ఎలా వచ్చిందో తెలిస్తే సర్వభ్రష్టం…!

ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే ప్రతిష్ఠ మూసీ పాలు!!!
అందుకే నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి “ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి” అని పురమాయించాడు…!

చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు. నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు…!

మాలవీయ గారు నిజాం
లాంటి వాడి నుంచి కూడా “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అని నిరూపించారు…!

జీవితమూ నిజాం నవాబు లాంటిదే. అది ఒక చెప్పే విసిరేస్తుంది. మనమూ మదన్ మోహన్ మాలవీయ లాగా ఆ అరకొర అవకాశాన్ని కూడా వాడుకుంటామా లేదా అన్నదే అసలు ప్రశ్న!!!

అన్నట్టు…మన దేశపు ధ్యేయవాక్యం “సత్యమేవ జయతే” ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ గారే…!