Devotional

అవన్నీ పాత సింహాలు…దుర్గ గుడి ఈవో నిర్లక్ష్య వివరణ

Durga Temple EO Suresh Babu Calls Stolen Lions Old And Blackened

దుర్గగుడి రథంపై ఈవో సురేష్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రథం అనేది చిన్న వస్తువు కాదని లాకర్‌లో పెట్టి చేసేది కాదని ఈవో అన్నారు. సుమారు 250 కేజీల బరువు.. చెక్కమీద సిల్వర్ షీట్ కొట్టి తయారు చేశారని, 18 ఏళ్ల క్రితమే తయారైన రథమని పేర్కొన్నారు. అప్పుడున్న బరువు ఇప్పుడుండదని, ఇప్పుడు ఊడిన విగ్రహాల్నే అందరూ చూశారని తెలిపారు. అవి ఎంత నల్లగా ఉన్నాయో అందరికీ తెలుసని, అసలు నిజంగా అది వెండిదా..? కాదా..? పరిశీలించాలని సురేష్‌బాబు పేర్కొన్నారు. దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో మర్మం అంతుచిక్కడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు… తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటారా?…లేక నింద ప్రైవేట్ సెక్యురిటీపై నెట్టే ప్రయత్నం చేస్తారా?..వంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. సింహాల అదృశ్యంలో ఇప్పటికే మంత్రి, ఈవో సురేష్ బాబు పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. రికార్డులు పరిశీలించడానికి మూడు రోజుల సమయం దేనికి అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింహాలు అపహరణకు గురైయ్యాయో లేదో తేల్చడానికా?.. పోయిన సింహాల స్థానంలో కొత్తవి అమర్చడానికా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రథాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దుర్గగుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. రథాలకు షెడ్లను నిర్మించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం భద్రతా సిబ్బంది దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. రథాలకు షెడ్లను నిర్మించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం భద్రతా సిబ్బంది కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. అనంతరం అధికారులు వెండి రథాన్ని పరిశీలించేందుకు దానికి కప్పి ఉంచిన ప్లాస్టిక్‌ కవరు తీసి పరిశీలించారు. రథంపై నాలుగు వైపులా ఉండాల్సిన వెండి సింహాల్లో మూడు మాయమైనట్లు ఈ సమయంలోనే గుర్తించారు.