Editorials

కాలుష్యం కారణంగా కరుగుతున్న హిమాలయాలు

Climate Change Causing Himalayas To Melt

హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎడారి దేశాల నుంచి శీతల పవనాల ద్వారా దుమ్ము హిమాలయాల ఉత్తర భాగంలో కేంద్రీకృతం అవుతూ.. అక్కడి గాలిని కలుషితం చేస్తోందంట. పరిశ్రమలు పెరగడం, వాతావరణ మార్పులతో సాధారణం కన్నా ఎక్కువగా దుమ్ము విడుదల అవుతోంది. దుమ్ము, వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం.. ఈ మూడు అంశాలు రాబోయే రోజుల్లో దాదాపు వంద కోట్ల మందికి నీటి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందంట. పచ్చదనం పెంచి.. కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించాలని నిపుణులు చెబుతున్నారు.