వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి.. ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి.. ఏం చేసినా చెల్లుతుందనే భావన తమ పార్టీ నేతల్లో కనిపిస్తోందన్నారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ లేఖ బాధ్యతారాహిత్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మగడ్డ రాజీనామా కోరడం..రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి నిదర్శనమని రఘురామ కృష్ణరాజు విమర్శించారు. గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కోర్టులు జోక్యం చేసుకుని.. ఎన్నికలు నిర్వహించమని ఆదేశించవచ్చన్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది ముందుకు రాకుండా.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని రఘురామ హితవు పలికారు.
దానికి లేనిది…దీనికి ఎందుకో?
Related tags :