Politics

లోకేశ్ రెడీ అంటే నేను రాజీనామా చేస్తా

Proddutur MLA Rachamallu Sivaprasad Reddy Challenges Lokesh

తెదేపా నేత నందం సుబ్బయ్యను హత్య చేయించారన్న ఆరోపణలను కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఖండించారు. హత్యారోపణలు చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొని ఊరొదిలి వెళ్లిపోతానన్నారు. ‘నేను నందం సుబ్బయ్యను హత్య చేయించానని.. హత్య చేసేందుకు ప్రోత్సహించానని నువ్వు నమ్మితే.. నీకో సవాల్‌ విసురుతున్నా. ఈ హత్య అంశంపై ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం కోరదాం. నువ్వు ఇక్కడ పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తా. పోటీలో పాల్గొందాం. నందం సుబ్బయ్యను శివప్రసాద్‌రెడ్డి హత్య చేశాడని మీరు నమ్మితే నాకు ఓటేయండని నువ్వు ప్రజలను ఓటు అడుగు. హత్య చేయలేదని మీరు నమ్మితే నాకు ఓటు వేయండి అని నేను అడుగుతా. ఒకవేళ నేను ఓటమిపాలైతే ఆ మరుక్షణమే రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తా. ఊరు వదిలి వెళ్లిపోతా’ అని లోకేశ్‌కు శివప్రసాద్‌రెడ్డి సవాల్‌ విసిరారు.