Movies

శంకర్-యాష్-రామ్‌చరణ్

శంకర్-యాష్-రామ్‌చరణ్

రామ్‌చరణ్‌-యశ్‌.. ఒకరేమో తెలుగులో స్టార్‌ హీరో.. మరొకరేమో కన్నడలో రాక్‌స్టార్‌.. వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే అభిమానుల కలను ప్రముఖ దర్శకుడు శంకర్‌ నిజం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్‌ త్వరలో ఓ బిగెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం పవన్‌కల్యాణ్‌-చరణ్‌ స్క్రీన్‌ పంచుకోనున్నారని ఇటీవల నెట్టింట్లో పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించే పనుల్లో ఉన్న శంకర్‌ అతి త్వరలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అనంతరం ఓ యాక్షన్‌ డ్రామాను ప్రారంభించనున్నారని.. హిస్టరికల్‌ వార్‌ డ్రామాగా(చారిత్రాత్మక యుద్ధ కథాంశం) అది తెరకెక్కనుందని సమాచారం. 2022 నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నట్లు చిత్రపరిశ్రమలో భోగట్టా. అంతేకాకుండా నటీనటులుగా ఎవర్ని తీసుకోవాలనే విషయంలో శంకర్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఇందులో ఓ పాత్ర కోసం కన్నడ నటుడు యశ్‌ను ఫిక్స్ చేసిన దర్శకుడు మరో పాత్ర కోసం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని.. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు సైతం ఇందులో భాగం కానున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.