Movies

జులై 16న KGF2

జులై 16న KGF2

టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’‌. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. జులై 16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.