Movies

పిచ్చిరాతలపై ఆమని మండిపాటు

పిచ్చిరాతలపై ఆమని మండిపాటు - Actress Aamani

నేను నిక్షేపంగా ఉన్నాను!!
“ఆమనికి హార్ట్ ఎటాక్” అనే వదంతి ఎలా పుట్టిందో ఏమో గానీ… ప్రస్తుతం ఈ పుకారు పరిశ్రమ వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. దీనిపై ఆమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాను నిక్షేపంగా, షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని ఆమె తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లడాన్ని… ‘హార్ట్ ఎటాక్’గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆమని పేర్కొన్నారు.
ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ ఇటీవల విడుదలై మంచి ప్రసంశలు పొందుతుండగా… ఆమని నటిస్తున్న “బ్యాచిలర్, చావు కబురు చల్లగా”తోపాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి!!