Kids

నారాయణ కళాశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన-తాజావార్తలు

Parents Protest In Front Of Narayana College Against Payments

* ఇబ్రహీంపట్నం బొంగులూరు గేటు వద్ద ఉన్న నారాయణ కాలేజీ లో పేరెంట్స్ ఆందోళన..మొత్తం ఫీజు కడితేనే విద్యార్థులను అనుమతిస్తామని అంటున్న కాలేజీ యాజమాన్యం..ఫస్ట్ ఒక ఫీజ్ చెప్పి ఇప్పుడు వేరే ఫీజు కట్టాలి అంటూ కాలేజీ యాజమాన్యం వేధిస్తుంది అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు..కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులకు 70% ఫీజు కట్టాలని చెప్పిన కాలేజ్ యాజమాన్యం..ఇప్పుడు హాస్టల్ ఫీజు నెలకు రూ. 7,500 చెల్లించాలంటూ బెదిరిస్తున్న కాలేజీ యాజమాన్యం..ఫీజు లో థర్టీ పర్సెంట్ తీసేసి ఫీజు కట్టమని చెప్పి ఇప్పుడు మళ్లీ ఎక్కువ ఫీజు చెప్తున్నారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నారాయణ కాలేజీ లో ఆందోళనకు దిగారు..ఉదయం నుండి వంద మంది పేరెంట్స్ విద్యార్థులతో కలిసి కాలేజ్ కి వచ్చిన ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె అనుచరులు ధృవీకరించారు.హైదరాబాద్ లోటస్ పాండ్ లో మంగళవారం కీలక సమావేశం.సమావేశం ఎజెండాపై ఉత్కంఠ సాగుతోంది.ఇప్పటికే YSRCP లో అనేక ఊహగానాలు ఉన్నవి.”YSR అభిమానులరా రండి.తరలి రండి! ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది” అని సోషల్ మీడియా లో ప్రచారం ఉధృతంగా సాగుతోంది.తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. దీని వెనుక ఎవరున్నారు? ఆమె వ్యూహం ఏమిటి? జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వనందుకు షర్మిల కొంతకాలంగా తీవ్ర నిరాశతో ఉన్న మాట నిజమే. అంత మాత్రాన ఆమె కొత్త పార్టీ పెట్టి ఏమి సాధించగలరు? అనే ప్రశ్న వస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రపార్టీ గా ముద్రపడింది. అలాంటి పార్టీ అధినేత సోదరి పక్క రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించినట్లయితే తెలంగాణ ప్రజలు ఎట్లా ఆమోదించనున్నారు? షర్మిల వెనుక ఖచ్చితంగా TRS ప్రముఖులు ఉండే అవకాశం ఉన్నట్లు ఒక ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. బీజేపీని ఎదుర్కునే వ్యూహం లో భాగంగా ‘రెడ్డి’సామాజిక వర్గాన్ని చేరదీయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు వదంతులు ఉన్నవి.ఇవి నిజంగా ఎలా వర్కవుట్ అవుతాయో ఊహాజనితమే!
YS Sharmila New Party In Feb 2021

* సర్పంచ్ బరిలో ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి వాణి.. తొగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని వాణి.. తొగరాం స్వగ్రామం కావడంతో సర్పంచ్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పీకర్ తమ్మినేని

* సినీనటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే ‘నందమూరి బాలకృష్ణ’ త్వరలో ప్రజల్లోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో అరాఙకం రాజ్యం ఏలుతుందని, ప్రజలను దోచుకుంటున్నారని, అధికార వైకాపా పాలనలో విఫలం అయిందని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ త్వరలో తాను పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని తెలిపారు. ప్రస్తుతం ‘బోయపాటి శ్రీను’తో నిర్మిస్తోన్న సినిమా పూర్తి అయిన తరువాత రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి పెడతానని నెల్లూరు టిడిపికి నేతలకు ఆయన తెలిపారని సమాచారం. ‘జనం’ కోసం రోడ్ల మీదకు వస్తానని, ప్రజలందరినీ కలుస్తానని ఆయన చెప్పారని చెబుతున్నారు. రోడ్ల మీదకు రావడం అంటే ఇక ‘పాదయాత్ర’నేని అది ఏ రూపంలో ఉంటుందో ఇంకా తెలియదని కొందరు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పాలనను చూడలేదని ఆయన అన్నారట. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో అరాచకాల గురించి వింటుటామని, కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు అంత కన్నా ఎక్కువగానే ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

* అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్‌ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు.

* ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన పర్వతానికి సంబంధించిన శిలలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముగ్గురిపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైంది. ఇండియా మార్ట్‌ సీఈఓ దినేష్‌ అగర్వాల్‌, అతడి సోదరుడు బ్రిజేశ్‌, మరో వ్యక్తి అంకుల్‌ అగర్వాల్‌పై లక్నోలోని మధుర ప్రాంతానికి చెందిన ప్రజలు కేసు పెట్టారు. ఆదివారం పెద్ద సంఖ్యలో గోవర్ధన్‌ పోలీస్ట్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్న గ్రామస్తులు, సాధువులు సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గిరిరాజ్‌ జీ’ (గోవర్ధన పర్వతం) హిందువుల నమ్మకానికి సంబంధించినదని, ఇండియా మార్ట్‌ గోవర్ధన పర్వత శిలలను అమ్మటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వెంటనే గోవర్ధన శిలల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఇండియా మార్ట్‌ ఒక్కో శిలను రూ. 5,175 విక్రయిస్తోంది.

* రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌​ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, గాయని లతా మంగేష్కర్‌తో పాటు బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై దర్యాప్తు జరుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించడం సంచలనం రేపుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్‌ సంస్థలు దర్యాప్తు జరుపుతామని సోమవారం అనిల్‌ ప్రకటించారు. వరుస ట్వీట్స్‌ వెనుక కేంద్ర ప్రభుత్వ లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

* ఎన్నికల్లో పలు చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు వస్తుంటాయి. 2013 జూలై 31వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనే జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం కరవాక సర్పంచ్‌ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో సిర్రా మణికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అతడికి డమ్మీ అభ్యర్థిగా అతడి అన్నయ్య సిర్రా శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. పరిశీలన సమయంలో మణికుమార్‌ ఎమ్మార్సీ కార్యాలయంలో క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ)గా పనిచేస్తున్నందున అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సిర్రా శ్రీనివాస్‌ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.

* టోల్‌గేట్ల వద్ద నగదు రహిత టోల్‌ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్‌’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్‌ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్‌ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు.

* ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కార్తిక్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్‌లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్‌ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు.

* అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ సీ.ఎన్‌.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్‌ఆర్‌ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు.

* సెంట్రల్‌ మాల్‌కు అధికారులు షాకిచ్చారు. 10 రూపాయల కోసం కక్కుర్తి పడిన మాల్‌ యాజమాన్యానికి దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన వి. బెజ్జం అనే వ్యక్తి ఇటీవలె సెంట్రల్‌ మాల్‌లో 1400 రూపాయలు చెల్లించి ఓ షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ప్యాకింగ్‌ అనంతరం షర్ట్‌ను మాల్‌ లోగో ముద్రించిన పేపర్‌ బ్యాగ్‌ ఇచ్చి పది రూపాయలు వసూలు చేశారు. దీనిపై కన్స్యూమర్‌ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదుదారునికి పరిహారంగా మాల్‌ యాజమాన్యం 15వేలు చెల్లించాలని కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

* ట్రాఫిక్‌ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్‌ ప్లేట్‌కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్‌ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్‌ ప్లేట్‌ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్‌ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌ సీన్‌ని మీమ్‌గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్‌ తెగ వైరలయ్యింది.

* ఏపీ తెదేపా అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బెయిల్‌ మంజూరైంది. రూ.50వేల పూచీకత్తుతో శ్రీకాకుళం జిల్లా సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యలో ఇటీవల అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన ఘటనల ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సహా 22 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

* రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరగా.. లిఖిత పూర్వకంగా వివరాలు ఇస్తే పరిశీలిస్తానని వెంకయ్య చెప్పారు. ఆ జవాబుతో సంతృప్తి చెందకుండా ఆయన నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

* రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నదాతలు తమ ఆందోళన విరమించి.. చర్చలకు రావాలని పార్లమెంట్‌ నుంచి ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు అనువైన తేదీ ప్రభుత్వమే నిర్ణయించాలని రైతు సంఘాల నాయకులు తెలిపారు.

* రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలు ఆవిష్కృతమయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ నాలుగు రకాల విప్లవాలతో గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పులు వస్తాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత గంభీరావుపేటలో రూ.2.26 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, నూతన డిగ్రీ కళాశాల భవనాలను కేటీఆర్‌ ప్రారంభించారు. అత్యాధునిక ప్రమాణాలతో డిగ్రీ కళాశాలను తీర్చిదిద్దుతామన్నారు.