Politics

జగనన్న ఆశీస్సులతో రాజన్న రాజ్యం తెస్తా-తాజావార్తలు

Vijayasai Reddy Apologizes In Rajyasabha - YS Sharmila Starts YSRTP

* తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే కోరిక ఉందని.. ఏవిధంగా? ఎప్పుడు? అనే దానిపై చర్చలు జరుపుతున్నామని ఏపీ సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. లోటస్‌పాండ్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మిగతా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని.. ఇక్కడే నిర్వహించాలా? జిల్లాలకు తానే వెళ్లి మాట్లాడాలా? అనే దాన్ని నిర్ణయించాల్సి ఉందన్నారు. ‘‘తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా! రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా? రాజన్న రాజ్యం తేవాలి. జగన్‌మోహన్‌రెడ్డి నా తోడబుట్టిన అన్న. ఆయన ఆశీస్సులు తనపై ఉన్నాయనే అనుకుంటున్నాను. పార్టీ ఇప్పుడే అవసరమని భావిస్తున్నా. నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యా. రాష్ట్రంలో రాజన్న రాజ్యానికి అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. త్వరలో అన్ని జిల్లాల నేతలతో మాట్లాడతా’’ అని షర్మిల అన్నారు.

* హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు నేను పాకిస్థాన్ వెళ్లలేదు, నిజంగా నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నా. పాకిస్థాన్‌ వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. అక్కడి పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతాను’ అని రాజ్యసభలో తన పదవీ విరమణ ప్రసంగంలో గులాం నబీ ఆజాద్‌ అన్నారు.

* కరోనా నుంచి కోలుకొని, తమిళనాడుకు చేరుకున్న ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్‌ వెల్లడించారు.

* తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ… ’‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్‌ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడా. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’’ అని షర్మిల తెలిపారు.ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు.

* సరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు విమర్శలు చేసింది. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు భారత్‌ కారణమంటూ మాట్లాడింది. ఆదివారం కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ..భారత్‌, చైనా సరిహద్దులను అధికారికంగా గుర్తించలేదని వెల్లడించారు. ‘చైనా 10 సార్లు అతిక్రమణలకు పాల్పడితే..మనం 50 సార్లు అతిక్రమణలు చేయాలి. చైనా విస్తరణ కాంక్షతో దురాక్రమణకు పాల్పడుతోంది. కానీ, దాని ఆటలు సాగవని కేంద్రం భరోసా ఇచ్చింది’ అని చైనా తీరును మంత్రి ఎండగట్టారు.

* ‘రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మనిషి ఒకచోట… ఆయన మనసు మరోచోట ఉందని…’ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మంగళవారం ఉదయం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ‘‘ రాజ్యసభ ఛైర్మన్‌పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా. వెంకయ్యనాయుడిపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదు, ఆవేశంలో మాట్లాడా. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు’’ అని ప్రకటించారు.

* ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 12 జిల్లాల్లోని 2,723 పంచాయతీలు, 20,157 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో జరిగిన పోలింగ్‌.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

* వైకాపా సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్న భావోద్వేగానికి గురయ్యారు. సంబంధంలేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని కంటతడి పెట్టారు. రాష్ట్రంలో జగన్‌ మోహన్‌రెడ్డికి, వైకాపాకు కింజరపు కుటుంబం గుదిబండలా తయారైందని వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడికి నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

* తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మే 5వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది 11 పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది.

* తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఆయన చురకలంటించారు. తెరాసలో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని వివరణ ఇచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మా పార్టీ ఉన్నన్ని రోజులూ వేరే పార్టీ మనుగడ సాధించలేదు. మా పార్టీకి, మా నేత కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు, రాదు. ప్రజలందరూ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలు వేరే శక్తులొచ్చి ఫ్యాక్షనిజం చేస్తామంటే ఒప్పుకోరు’ అని వ్యాఖ్యానించారు.

* వరద సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్‌ కోలుకోలేకపోతోంది. చమోలీ జిల్లా జోషి మఠ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తపోవన్‌ జలవిద్యుత్కేంద్రంలోని 120 మీటర్ల టన్నెల్‌లో బురద మొత్తాన్ని తొలగించాయి. ఈనేపథ్యంలో మరికొన్ని మృతదేహాలను గుర్తించాయి. దీంతో దుర్ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకు దాదాపు 30 మందిని రక్షించారు. ఇంకా 160 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది.

* దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ జోరుకు అడ్డుకట్టపడింది. గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో కొత్త రికార్డులను అధిరోహించిన సూచీలు.. మంగళవారం నాటి సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయి.. ఫ్లాట్‌గా ముగిశాయి.

* హైదరాబాద్‌ శివారు నార్సింగి పరిధిలో ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. దోషి దినేశ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..‌ నార్సింగి పరిధిలో 2017 డిసెంబర్‌ 12న ఐదేళ్ల బాలిక అపహరణకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. స్థానికంగా ఉన్న నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

* ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది వరద విపత్తు ప్రాంతాల్లోని పరిస్థితుల్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ మేరకు విపత్తు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి అమిత్‌షా మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో మంచుచరియలు కూలడంతో ధౌలిగంగా నది ఉప్పొంగిన విషయం తెలిసిందే.

* హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు నేను పాకిస్థాన్ వెళ్లలేదు, నిజంగా నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నా. పాకిస్థాన్‌ వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. అక్కడి పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతాను’ అని రాజ్యసభలో తన పదవీ విరమణ ప్రసంగంలో గులాం నబీ ఆజాద్‌ అన్నారు.

* ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్‌కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది. ఛాంపియన్‌షిప్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్‌ ఆడే సంగతి తెలిసిందే.