Food

క్యాన్సర్ “పీచ”మణుస్తుంది

క్యాన్సర్ “పీచ”మణుస్తుంది

ఆహారంలో పీచు ఉంటే అది పేగుల లోపలి భాగాన్ని శుభ్రంగా చేస్తుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఇలాంటి పీచులేని పదార్థాలు గతంలో పాశ్చాత్యులు విస్తృతంగా తీసుకునేవారు. దాంతో వారిలో పెద్దపేగు, కోలోరెక్టల్, రెక్టల్‌ క్యానర్లు ఎక్కువ. ఇటీవల మనం కూడా మారిన మన జీవనశైలి అలవాట్లలో పీచు ఎక్కువగా లేని ఆహారాలవైపు మళ్లాం. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే అన్ని రకాల ముడిధాన్యాల (హోల్‌ గ్రెయిన్స్‌)లో పీచు పుష్కలంగా ఉంటుంది. కేవలం పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక… అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం.