DailyDose

మంగళగిరిలో మహిళ అదృశ్యం-నేరవార్తలు

మంగళగిరిలో మహిళ అదృశ్యం-నేరవార్తలు

* గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన గృహిణి, హిందీ పండిట్ మిస్సింగ్. రాత్రి నుంచి కనపడకుండా పోయిన గృహిణి, ఈవెనింగ్ దేవస్థానం వద్ద దొరికిన ఆమె టూ వీలర్. పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం. ఆందోళనలో కుటుంబ సభ్యులు.

* తెలంగాణ నుండి విజయవాడ వైపు ప్రైవేటు వాహనం లో తరలిస్తున్న రూ.30 లక్షల నగదు ఎన్నికల నియమావళి మేరకు స్వాధీనం చేసుకున్న తిరువూరు పోలీసులు.

* ప.గో జిల్లా నల్లజర్ల మండలం దూభ చర్ల DIET కళాశాల లో ఫుడ్ పాయిజన్ వల్ల ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత.

* బెయిల్ పై వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్ళీ జైల్ కు వెళ్ళిపోతారన్న భయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద జరిగిన సభలో తడబడి కర్మాగారాన్ని కాదు కారాగారం అని సంబోధించారని టిడిపి ఎమ్మెల్యే బుద్ద వెంకన్న ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అంతా జగన్ , విజయసాయిరెడ్డి కనుసన్నల్లోను జరుగుతుందని రాజ్యసభలో పరిశ్రమలు మంత్రి ధర్మేంద్ర ప్రధాని మాటలతో తెటతెల్లమైందన్నారు .

* బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఆరుగురు మృతితమిళనాడు విరుధానగర్​లోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి.

* న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ పెట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే, ఆమంచి కృష్ణమోహన్ నేడు విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.