Devotional

బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?-TNI ఆధ్యాత్మిక తరంగిణి

బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?-TNI ఆధ్యాత్మిక తరంగిణి

* సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్లఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. సాక్షాత్తూ ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళింపు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.

* ఒక గృహస్తుకు ఒకరోజు ఒక కోరిక కలిగింది, నిజానికి దేవుడున్నాడా లేడా తెలుసుకోవాలి అని, వెంటనే ఒక గురువును కలిసి తన కోరికను తెలియచెప్పి తనకు సందేహాన్ని తీర్చుమని అడిగాడు.దానికి గురువు ఇప్పుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను నీవు సిద్దమేనా ?” అని అడిగాడు.దానికా వ్యక్తి ” ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. ఇక మీరు ప్రారంభించండి ” అని వినయంగా చెప్పాడు..వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు… ఇపుడు గురువు వచ్చిన వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా…గు : ఈ గ్లాసులో ఏముంది ?శి : మంచి నీరు.గు : సరిగా చూసి చెప్పు కేవలం మంచి నీరేనా ?శి : అవును గురువు గారు కేవలం మంచి నీరే.గు : అయితే ఒకసారి త్రాగి చెప్పు..శిష్యుడు నీటిని త్రాగాక..గు : ఇప్పుడు చెప్పు అది ఏ నీరు ?శి : గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు..గు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్ ?శి : ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులో కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.గు : అంటే అనుభవపూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకోలేకపొేయావ్ అంతేనా ?శి : అవును.గు : సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే ఆ నీటీలో పంచదార చూపించు..శి : అసాధ్యం గురువు గారూ..గు : ఏం ఎందుకని ?శి : పంచదార పూర్తిగా నీటితోకలసి పోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం..గు : అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో…శిష్యుడు సరైన సమాధానాలే ఇచ్చాడు కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు. గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాధానాలు చెప్తూపోయాడు. విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు…అపుడు గురువు చూడునాయనా.. నీవు నీటిని చూసి రుచి చూడకయే ఏవిధంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డవో అదేవిధంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లోపడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు..అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారోవారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది.పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది…అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు…ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే, నీవు ఏ విధంగానైతే నీరంతా కరిగిపోయి, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధాన ఈ సృష్టంతా నిండిపోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం…సృష్టిలోఉండే ప్రతీదీ భగవత్సరూపమే.జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప, నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవు నేను ఈ చెట్టూ, పుట్టా, వాగూ, వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు.వాడే నిన్ను ఉద్దరిస్తాడు.” అని చెప్పగా శిష్యుడు ఆనందం అంబరాన్ని తాకింది. తన సందేహం పటాపంచలై పోయింది.గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విధంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు.ఇది కథలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.సైన్స్ అనేది కూడా ఒక విధమైన దైవిక సిద్దాంతమే. శక్తిని సృష్టించలేం నశింపజేయలేం అని సైన్స్ చెప్తుంది.మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది?.!

* పెళ్లి *సాధారణంగా జరగాలి.షష్టిపూర్తి ఘనంగా జరగాలి*మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.ప్రతివారికీ మృత్యువు60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో ,70 వ యేట భీమరథు డు అను పేరుతో,78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి జరుపుకుంటారు.💐🌺

* శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు.తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు.ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైదరాబాద్‌ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, యువ హీరో ఆది దంపతులు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సతీమణి స్నేహ స్వామివారి సేవలో పాల్గొన్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.శశి చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు ఆది తెలిపారు.