Movies

యువరాణిగా సన్నీ

యువరాణిగా సన్నీ

సన్నీ లియోనీ తొలుత బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ తన సత్తా చాటుతోంది. తెలుగులో ఆమె ‘కరెంట్‌ తీగ’లో కనిపించి మెరుపులు కురిపించింది. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘పి.ఎస్‌.వి: గరుడవేగ’ చిత్రంలో ప్రత్యేకగీతంలో కనువిందు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఓ హర్రర్‌ కామెడీ చిత్రంలో నటించనుంది. ఇందులో ఆమె యువరాణిగా కనుపిస్తుందట. ఈ చిత్రానికి ఆర్‌.యువన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సతీష్‌, సౌమ్య మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీఏయు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్, వైట్‌ హార్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. డీవీ శక్తి నిర్మాత. జావేద్ రియాజ్‌ సంగీతం అందిస్తారు. దీప్‌క్ డీ మీనన్‌ ఛాయాగ్రహకుడు.