Devotional

పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభంతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్ర‌తి ఏటా నారాయణగిరి ఉద్యానవనంలో ఈ వేడుకలు నిర్వ‌హించేవారు. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో భక్తుల ఆరోగ్యభ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు. మే 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో మ‌ధ్యాహ్నం 4 గంట‌లకు ఈ ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.మొదటిరోజు వైశిష్ట్యం :శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన గురువారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకీపై కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, అర్చకస్వాములు పాల్గొన్నారు.