* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో మంటలు చేలరేగాయి.
* చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో కలెక్టర్ ఒక యువకునిపై చేయిచేసుకున్నారు. అంతేకాకుండా అక్కడున్న పోలీసులు కూడా ఆ యువకుణ్ణి కొట్టారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ ఆ యువకునికి క్షమాపణలు చెప్పారు.ఆ యువకుడిని అమన్ మిట్టల్ (23)గా గుర్తించినట్లు సూరజ్‌పూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందున అతనిపై కేసు నమోదైంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం…మాస్క్ పెట్టుకున్న ఒక యువకుడు కలెక్టర్‌కు ఒక కాగితంతో పాటు మొబైల్ ఫోన్‌లో ఏదో చూపించడానికి ప్రయత్నం చేశాడు.ఇంతలో కలెక్టర్ అతని ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టారు. తరువాత ఆ యువకునిపై చేయిచేసుకున్నారు.సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కూడా ఆ యువకుడిని కర్రతో కొట్టారు.ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో కలెక్టర్ క్షమాపణలు కోరారు.ఆ యువకునిపై చేయిచేసుకున్న సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ ఒక ప్రకటనలో తాను లాక్‌డౌన్ సమయంలో బయటికి వచ్చిన ఒక యువకుడిని కొట్టిన ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తన ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని, ఆ యువకుడిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.సూరజ్‌పూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు.
* కొత్తకోట మం’ నాటవెల్లి సమీపంలో జాతీయ రహదారి పై ప్రమాద వశాత్తు లారీ ఢీకొట్టడంతో దాదాపు 35 గొర్రెపిల్లలు మృతి.
* అసోం రైఫిల్స్, పోలీసులు.. అనుమానిత దిమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య ఆదివారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది.ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.కార్బియన్ లాంగ్ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ సోనోవాల్ దీనికి నేతృత్వం వహించారు.పోలీసుల కాల్పుల్లో ఆరుగురు డీఎన్ఎల్ఏ సభ్యులు హతమైనట్లు అధికారులు తెలిపారు.నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహ ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.