Movies

ప్రభాస్‌తో వెళ్తా…

ప్రభాస్‌తో వెళ్తా…

రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డేటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఒకవేళ తనకు అవకాశం వస్తే ఒకరోజు ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని చెప్పింది. తాను ప్రభాస్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ అని మనసులో మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవలె కార్తీ సరసన నటించిన సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటీకీ.. రష్మిక పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ.