Agriculture

చెరువులను కాపాడండి

చెరువులను కాపాడండి

చెరువులతో చెలిమి – చిర కాలం ఇస్తుంది మనకు కలిమి.!

ఇప్పుడు మనిషికి లభించే నీటిని పరిగణనలోకి తీసుకుంటే, 1947 లో లభ్యమైన నీటితో పోలిస్తే, మనకి 25% అంటే, నాలుగవ వంతు మాత్రమే లభిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం 2050 సంవత్సరం వచ్చెసరికి అది 18 శాతానికి పడిపోతుంది. ఇక అప్పుడు సాగు నీరే కాదు,త్రాగు నీరు కూడా లేని పరిస్థితి ఎదురౌతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ప్రజలకి తాగడానికి కూడా నీళ్ళు దొరకకపోతే, మన జీవితాలు హాయిగా, సుఖంగా ఉన్నాయన్న భ్రమతో మనల్ని మనం మోసపుచ్చుకోవడం అవుతుంది.

చెరువుల గురించిన అవగాహనని పెంపొందించడం
ఇప్పుడు మనం ముఖ్యంగా చేపట్టవలసింది, చెరువుల ను గుర్తించి,పూడికలు తీసి,గట్టు సరిగా ఏర్పాటు చేయాలి. నీరు పారడానికి అనువుగా కాలువలు ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అందులో అడవి చెట్లూ, అక్కడ వ్యక్తుల స్వంత భూమి ఉంటే, అందులో రైతులు వ్యవసాయపంటలకి బదులుగా ఫలాలనిచ్చే వృక్షాధార పంటలూ వెయ్యాలి. చెట్లు కాపుకి వచ్చేదాకా, ప్రభుత్వం రైతులకి ఉచితంగా మొక్కల్ని పంపిణీ చెయ్యాలి. ప్రభుత్వం అప్పటి దాకా రైతులకి ఆర్థిక సహకారం అందించాలి. దానివల్ల రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మనం చెట్లు పెరగడానికి వీలైన అన్ని పద్ధతులూ అనుసరించాలి.

మన జీవిత కాలంలోనే మన చెరువులు ఇలా అంతరించిపోతుంటే మనం స్పష్టంగా మన భావితరాల మీద మనకు ఏ మాత్రం శ్రధ్ధ లేదని చెప్పకనే చెబుతున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ చెరువులు మనల్ని అక్కున చేర్చుకున్నాయి, మనల్ని పోషించాయి. ఇప్పుడు ఆ చెరువులను అక్కున చేర్చుకుని వాటిని రక్షించి, పోషించవలసిన సమయం ఆసన్నమయింది. ఎందుకంటే, ఈ దేశ గొప్పదనం ఈ దేశంలోని చెరువుల మీదే ఆధారపడి ఉంది. మనందరం కలిసికట్టుగా దాన్ని సాకారాం చేద్దాం.
ఇట్లు
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణసమితి
? 8555913959